పోలీసులపై దొంగల ముఠా దాడి....!
- దొంగలపై పోలీసుల కాల్పులు
- ఆరు బుల్లెట్లను కాల్చిన
పోలీసులు
- దొంగల మూటలో ఒక్కరిని
పట్టుకున్న పోలీసులు...
- దొంగల ముఠాసభ్యుడి అరెస్ట్
- పోలీసుల ధైర్య సాహసాలను
అభినందించిన జిల్లా ఎస్పీ
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
గత రెండు రోజుల క్రితం 25 న రాత్రి సమయములో పెద్ద ఎక్లారా గ్రామం నందు ఒక ఆవు దొంగలించబడినది. అదే విదముగా జుక్కల్ పోలీసు స్టేషన్ పరిధిలో కూడా రెండు ఆవులను దొంగిలించిన విషయములో కేసు నమోదు చేసుకొని మద్నూర్ జుక్కల్ ఎస్సైలు నేరస్థలములను పరిశీలించి సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించడం జరిగింది ఒక అనుమానిత వాహనము టెంపో గా నిర్ధారించనైనది. అట్టి వాహనము , నేరస్తులను పట్టుకోవడానికి సీఐ బిచ్కుంద ఆధ్వర్యములో బృందాలుగా ఏర్పడి దొంగల కోసం వేట సాగించారు. నేరస్తుల గురించి పెట్రోలింగ్ చేస్తున్న క్రమములో సోమవారం అర్ధరాత్రి సొనాల రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు మధ్యాహ్నం సమయమున పెట్రోల్లింగ్ వాహనం టీఎస్ 09 పిఏ3713 చేరుకోగా అక్కడ టెంపో, వాహనం అనుమానాస్పదంగా నిలబడి ఉండగా దానిని సోదా చేయటానికి వెళ్లిన కానిస్టేబుల్ విట్టల్, హెడ్ కానిస్టేబుల్ శంకర్ లపై నేరస్తులు తమ వద్ద ఉన్న రాళ్లతో దాడిచేసినారు. అక్కడే పోలీసు వాహనాలపై దాడులకు దొంగలు పాల్పడ్డారు. పోలీసులపై దాడి చేసి దొంగలు వారి వాహనము లో తడుగూరు వైపు పారిపోతుండగా, ఇట్టి విషయం ఎస్ఐకి సమాచారం ఇవ్వక, పోలీసు స్టేషన్ నందు హాజరుగా ఉన్న ఎస్సై శివ కుమార్ దొంగల వానాన్ని వెంబడిస్తూ, పొరుగు పోలీసు స్టేషన్లు బిచ్కుంద సమాచారం ఇచ్చినారు. దాదాపు 10 కిలోమీటర్లు వెళ్లిన పోలీసు వారు కూడా వదలకుండా వెంబడిస్తుండగా దొంగలు పోలీసు వాహనము పై రాళ్ళూ రువ్వుతూ , మద్నూర్ వైపు పారిపోవడానికి ప్రయత్నిoచి, పెద్ద తాడగూరు చౌరస్తా దగ్గర వారి వాహనం ఆపి వారి వెనక వస్తున్న పోలీసు వాహనం వైపు వేగంగా వారి వాహనాన్ని తీసుకువచ్చి పోలీసు వాహనాన్ని ఢీ కొట్టారు. వెంటనే ఆత్మ రక్షణ కొరకు మద్నూర్ ఎస్సై శివ కుమార్ తన యొక్క సర్వీస్ రివాల్వర్ తో (6) రౌండ్ల కాల్పులు చేసినారు. భయపడిన దొంగలు వారి వాహనాన్ని దెగ్లూర్ వైపు మార్చినారు. వెంటనే ఎస్ఐ ,ఇట్టి విషయాన్ని దెగ్లూర్ మరికల్ పోలీసు వారికి సమాచారం అందజేశారు. వెంబడిస్తున్న పోలీసు వాహనం దెగ్లూర్ కరేగావ్ వద్ద రెండవసారి మళ్లీ ఢీకొట్టారు. పోలీస్ వాహనం అక్కడే నిలిచిపోయింది. వెంట ఉన్న మరో పోలీసు పెట్రోలింగ్ వాహనంలో కి ఎస్సై శివకుమార్ , సిబ్బంది దొంగల కోసం వెంబడించారు. మరికల్ పోలీసులు కర్రలు, రాళ్లు రోడ్డుకు అడ్డం పెట్టగా నేరస్తులు వాటిపై నుండి ఎక్కించుకొని తప్పించుకొని పారిపోయారు. మరికల్ పోలీసు లు హనేగావు వెళ్లేదారిలో రెండు కంటైనర్లు అడ్డం పెట్టినారు. ఎక్కడ తప్పించుకోవడానికి మార్గం లేకపోవడంతో మరికల్ పోలీసు వాహనoను మళ్లీ ఢీ కొట్టారు. వాహనాన్ని నిలిపి, వారి వద్ద ఉన్న మారణాయుధాలు, రాళ్లతో పోలీస్ వారిపై దాడి చేస్తూ పారిపోయే ప్రయత్నం చేసినారు. అయినప్పటికిని ఎలాగైనా నేరస్తుల పట్టుకోవాలనే అకుంఠిత దీక్షతో పోలీసు వారు ప్రయత్నించి ఒక నేరస్తుడిని పట్టుకున్నారు. నేరస్తులు వాడిన వాహనంలో దొంగిలించిన ఒక ఆవు మారణాయుధాలు, రాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వీటిని పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ దొంగలు పోలీసులు తమదైన శైలిలో విచారించగా తమ నాయకుడు షబ్బీర్ అని
మొత్తం ఏడుగురితో కలిసిన మూట ఈ నేరాలకు పాల్పడుతున్నటు తెలిపినాడు. అదేవిధంగా ఇట్టి నేరం చేసినప్పుడు ఎవరైనా వారిని నేరం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని కొట్టి, చంపి అయినా సరే నేరాలు చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామని పోలీసులకు వివరించారపోలీసుల పై దాడి చేసిన, వాహనములను ధ్వంసం చేసి , అవును దొంగించిన పై నేరస్తులపై మద్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. అతి త్వరలో పారిపోయిన మిగితా నేరస్తులను కూడా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బండ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇట్టి కేసులో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మద్నూర్ ఎస్సై శివకుమార్ పెట్రోలింగ్ సిబ్బంది విట్టల్, . శంకర్ అభినందిస్తూ 10 వేల నగదు పురాష్కారం జిల్లా ఎస్పీ అందజేశారు. ఇకపైన ఎవరైనా కూడా కామారెడ్డి జిల్లాలో నేరం చేయడానికి ప్రయత్నించిన నేరస్తులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బండ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇంతకుముందు బీదర్ ఎస్పీ శ్రీ కిషోర్ బాబు సారధ్యంలో తేదీ 14,జూన్ రోజున పొరుగు జిల్లాల క్రైమ్ మీటింగ్ జరిగినప్పటి నుండి బోర్డర్ జిల్లాలైన కామారెడ్డి, సoగారెడ్డి (తెలంగాణ), నాందేడ్ (మహారాష్ట్ర), మరియు బీదర్ కర్ణాటక అధికారుల మధ్య మంచి సమన్వయం ఏర్పడింది దాని ఫలితంగా రాత్రి జరిగిన దొంగల వేట కార్యక్రమంలో దెగ్లూర్ ఇన్స్పెక్టర్ సోహన్ గ మార్కల్ ఇన్స్పెక్టర్ విష్ణు తమ సిబ్బందితో పాటు రోడ్లపైకి వచ్చి, నాకాబందీ నిర్వహించి దొంగలను పట్టుకొనుట లో సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ బండ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Comments
Post a Comment