*బాలిక ఆచూకీ కోసం రంగంలోకి పాల్వంచ DSP ...*
CK న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న బాలిక మీడియం మేఘన ఆచూకీ కోసం భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు పాల్వంచ DSP సత్యనారాయణ సారధ్యంలో8 బృందాలుగా ఏర్పడి విస్తృతంగా విచారణ చేస్తున్నారు.
బాలిక కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు భద్రాచలం పాల్వంచ ములకలపల్లి మణుగూరు తదితర ప్రాంతాల పోలీస్ ఉన్న అధికారులు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు.
బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని బంజర తదితర ప్రాంతాలలో సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఆచూకీ కోసం వివరాలు సేకరించే పనులు పోలీసులు పడ్డారు.
బూర్గం పహాడ్ తాసిల్దార్ భగవాన్ రెడ్డి ఎంపీడీవో వివేక్ బూర్గం పహాడ్ సర్పంచ్ స్వప్న మరియు ప్రత్యేక స్వచ్ఛంద వాలంటరీ బృందాలు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు...
Comments
Post a Comment