అనుమతి లేకుండా టపాకాయల విక్రయాలు

 *అనుమతి లేకుండా టపాకాయల విక్రయాలు*


- నామమాత్రపు తనిఖీలతో

  సరి పెడుతున్న సంబంధిత

  శాఖ అధికారులు..!

- విద్యార్థులు, పట్టణ ప్రజలు

  టపాకాయల దుకాణాలతో

  ప్రమాదకరం ......!

- ప్రమాదం జరిగితే

  బాధ్యులెవరు...?

- ఎవరిపై చర్యలు

  తీసుకోవాలి ? .....

- కళాశాల గ్రౌండ్లోనే దుకాణాల

  ఏర్పాటు..?

- ఆట స్థలం కోసం విద్యార్థుల

  ఎక్కడికి వెళ్లాలి...?

సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  వ్యాపారులు ఇష్టారీతిగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే టపాకాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి టపాకాయలను విక్రయిస్తున్నారు. దీనిపై  అగ్నిమాపక కేంద్రంలో  ఫిర్యాదులు అందినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి, చేతులు దులుపుకుంటున్నారు. టపాకాయల  దుకాణదారులకు సమాచారం అందిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని సమాధానం చెప్పినట్లు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సమాధానం. 

పోలీసులు సైతం దుకాణం వద్దకు వచ్చి తిరిగి వెళ్లినట్లు సమాచారం. ఎలాంటి అనుమతి పత్రాలు లేని దుకాణాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయటం, సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు ఉండటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మతలబు ఏమిటో ?.....

- కళాశాల మైదానంలో టపాకాయల విక్రయ కేంద్రాలను  ఏర్పాటు చేయవచ్చా ? ......


 అది రోజు రద్దీగా ఉండే డిగ్రీ కళాశాల మైదానం. ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలు, పెద్దలు వాకింగ్, వాహనాల డ్రైవింగ్ నేర్చుకునే స్థలం. ఎవరి మాటలకు తలొగ్గి సంబంధిత శాఖ అధికారుల దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినప్పటికీ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్న  ?  టపాకాయలు అంటనే ప్రమాదం, అలాంటి ప్రమాదాన్ని జిల్లా నడిబొడ్డులో  ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారుల తీరు మారేనా ? .....

Comments