మా గ్రామం హరితహారంలో నాటిన మొక్కలు చెట్లు ఎక్కడా వెతికి పెడతారా సారూ


మా గ్రామం హరితహారంలో నాటిన మొక్కలు చెట్లు ఎక్కడా వెతికి పెడతారా సారూ అంటూ పిర్యాదు..



ఖమ్మం జిల్లా కల్లూరు పడమటి లోకవరం గ్రామ పంచాయతీలో  రోడ్డు మార్గానికి ఇరువైపులా నాటిన మొక్కలు కనిపించడంలేదు , ఎవరు మాయం చేశారు మొక్కలకు వెచ్చించి ఖర్చు నిధులు ఎంత మొక్కలు నిర్వీర్యo చేసింది ఎవరూ ఇందుకు బాధ్యులు కారకులు ఎవరూ తక్షణమే బాధ్యులు పై తగిన  చర్యలు తీసుకోవాలి అంటూ మండల  EGS  అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిణి హేమా మాళినికి వివరించి,అనంతరం సూపర్ నెంట్ బి వి యన్ యస్ శర్మా కి పిర్యాదు చేసిన స్థానిక గ్రామస్తులు రైతులు..


గ్రామస్తుల నుండీ ఫిర్యాదులు సేకరించిన సమ్మoదిత శాఖల అధికారులు హేమా మాళిని మరియు సూపర్ నెoట్ శర్మా విచారించి నిర్లక్ష్యంగా వ్యవహరిoచిన బాధ్యులపై చర్యలు తీసుకునెందుకు జిల్లా ఆదికారులకు సిపారసు చేస్తాము అంటూ పాత్రేకేయులకి వివరించడం జరిగింది..


స్థానిక గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా పలు మార్లు మొక్కలు నటించింది యదార్థమే కానీ గేదెలు మేకలు కారణంగా మొక్కలు  నిర్భిర్యమైన సంగతీ నిజమే అంటూ తేల్చిచెప్పడం విశేషం..


ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వర్లు, దొడ్డా నాగ రాజు, వెంకటేశ్వర రెడ్డి, పి శ్రీనివాసరావు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొని , దుర్వినియోగం చేసిన నిధులు తిరిగి తెప్పించకుంటే జిల్లా అదికారులను ఆశ్రయిస్తాము అంటూ పాత్రికేయుల సమావేశంలో వివరించిన గ్రామస్తులు.. 📞వివరాలకై.. 9866146489,9492093976

Comments