తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నీ ఆశ్రయించిన మద్దిశెట్టి

*తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నీ  ఆశ్రయించిన మద్దిశెట్టి.*



*ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లిలోని జాతీయ బీసీ కమిషన్ ఆదేశాల ప్రకారం ఐదుగుంటల బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని 2019 నుంచి తిరుగుతున్న క్రమంలో సర్వే చేసి ల్యాండ్ కి సంబందించి పంచనామా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ల్యాండ్ ఇవ్వలేదు.*


*అదే విధంగా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన కుదురుపాక నిర్మల గారు వారి తల్లిగారు వీలునామా రాసి ఇచ్చిన పది కుంటల భూమిని గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేసి ఇవ్వట్లేదు అని,*


*బూర్గంపాడు మండలం శ్రీరాంపురం ఎస్టీ కాలనీ, చింతకుంట గ్రామాలకు సంబంధించి సొడే చంద్రయ్య పేరు మీద వర్షా కాలంలో రోడ్డు నిర్మాణం లేక, సరైన వసతులు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, అదే విధంగా మాలోత్ గౌరీ భూమికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.*


*ఇట్లు*

*మద్దిశెట్టి సామేలు,*

*భారతీయ సర్వ సమాజ్ మహా సంఘ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్.*

Comments