వైకుంఠధామం రహదారి కబ్జా...

 *వైకుంఠధామం రహదారి కబ్జా...*


CK న్యూస్ ప్రతినిధి



 భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీలో నిర్మించిన వైకుంఠధామం కు వెళ్లే రహదారి ని దున్నించిన రైతు.


 వివరాలలోకి వెళితే నెల్లిపాక పంచాయతీకి అదే గ్రామానికి చెందిన పెదిరెడ్ల సుధారాణి తన పేరుమీద ఉన్న పట్టా భూమి సర్వేనెంబర్ 974 లో సుధారాణి తల్లిదండ్రుల అయినా పెదిరెడ్ల కిష్టమ్మ వెంకన్న ల జ్ఞాపకార్ధంగా నెల్లిపాక పంచాయితీ వారికి వైకుంఠధామం నిర్మించేందుకు 112 మీటర్ల పడవుతో 23.5 మీటర్ల వెడల్పు గల విస్తీర్ణంలో భూమిని మరియు వైకుంఠధామం కు వెళ్లేందుకు 3 మీటర్ల వెడల్పు తో 262 మీటర్ల పొడవు రహదారికి భూమిని నెల్లిపాక పంచాయితీ వారికి దానం ఇచ్చారని నెల్లిపాక సర్పంచ్ గొర్రెముచ్చు వెంకటరమణ తెలిపారు.


08-06-2020 తేదీన నెల్లిపాకగ్రామ పంచాయితీ గ్రామస్థుల సమక్షంలో దానపత్రం రాసి ఇచ్చారని సర్పంచ్ వెల్లడించారు.


 సుధారాణి దానమిచ్చిన భూమిలో నెల్లిపాక గ్రామపంచాయతీ వారు వైకుంఠధామం నిర్మించి 262 మీటర్ల పొడవునా 3 మీటర్ల వెడల్పు తో ఉపాధి హామీ పథకంలో రహదారి నిర్మించామని గత నాలుగు రోజుల క్రితం ఆ రహదారి ఆనుకొని ఉన్న  పాలడుగుల రాఘవయ్య అనే రైతు రహదారి నిర్మించిన భూమి నాది అని పంచాయతీ కి సమాచారం ఇవ్వకుండా తన ఇష్టానుసారం తో ట్రాక్టర్ తో పంచాయతీ వారు నిర్మించిన రహదారి దున్నించాడని సర్పంచ్ వెంకటరమణ విలేకరుల సమావేశంలో తెలిపారు. 


బుధవారం నాడు నెల్లిపాక సర్పంచ్ సెక్రెటరీ వార్డు సభ్యులు గ్రామస్థులు యువకులు కలిసి రహదారిని సందర్శించి తక్షణమే రహదారి దున్నించిన రైతు మరల ఆ రహదారిని నిర్మించి ఇవ్వాలని గ్రామపంచాయతీ నిర్మించిన రహదారిని దున్నించిన రాఘవయ్య అనే రైతుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ వారికి అశ్వాపురం రెవిన్యూ శాఖ వారికి పోలీస్ శాఖ వారిని  గ్రామస్థులు కోరారు. 


రహదారి దున్నించిన రైతుపై నెల్లిపాక గ్రామపంచాయితీ పాలకవర్గ సభ్యులు భద్రాద్రి జిల్లా కలెక్టర్ ను కలిసి పిర్యాదు చేస్తామని అన్నారు.


 ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్ కుమార్ వార్డు సభ్యులు సత్యనారాయణ కిషోర్ మాజీ ఎంపిటిసి వెంకటరమణ గ్రామస్థులు ఏకాంబరం ఏసు మోహన్ రావు సత్యం భువన్ సాయి తదితరులు పాల్గొన్నారు...

Comments