ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన మహానీయుడు 'గాంధీ

 ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన మహానీయుడు 'గాంధీ' 

-పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

-చిత్రపటాలకు పూలమాల వేసి నివాళ్లర్పించిన మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి 



ఖమ్మం: ప్రార్ధన... అభ్యర్ధన... నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన మహానీయుడు మన జాతిపిత 'మహాత్మా గాంధీ' అని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ శాంతి... అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం సాధ్యం అని నమ్మి అంటరానితనం, కుల, మత వివక్ష లేని సమసమాజ స్థాపనకు కృషి చేసిన ఘనత మన గాంధీ కే దక్కుతుందన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని. తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మధిర నియోజకవర్గ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కార్పోరేటర్ దొడ్డా నగేష్, నగర నాయకులు దుంపల రవికుమార్, మైనార్టీ నాయకులు షేక్ హిమామ్, చైతన్య, డీవీఎల్, చింతమళ్ల గురుమూర్తి, మొగిలిచర్ల సైదులు, కాంపాటి రమేష్, సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి, యన్నం కోటేశ్వరరావు, కన్నెబోయిన సీతారామయ్య, బీసీ నాయకులు తమ్మారపు బ్రహ్మయ్య, రూరల్ మండల టీఆర్ఎస్ యూత్ నాయకులు అజ్మీరా అశోక్ నాయక్, రాజశేఖర్రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments