రైతుల పాలిట శాపంగా మారిన చింతిర్యాల ఇసుక ర్యాంపు ...?

 *రైతుల పాలిట శాపంగా మారిన చింతిర్యాల ఇసుక ర్యాంపు ...?* 


*రైతులపై దౌర్జన్యం చేస్తూ చింతిర్యాల ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇసుక దళారులు...?*


*మాకు అడ్డు వచ్చేది ఎవరు మమ్మల్ని ఆపేది ఎవరు అంటున్న ఇసుకసురులు ...?*


*అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ మా చేతుల్లోనే మేము చెప్పిందే వేదం అంటున్న ఇసుక కాంట్రాక్టర్ ...?*


*టిఎస్ఎండిసి అధికారులని వివరణ కోరగా స్పందించని వైనం...?*


*గర్భిణీ స్త్రీలని హాస్పటల్ కు తీసుకువెళ్లడానికి 108 వాహనం చింతిర్యాల రోడ్డుపై రాలేని పరిస్థితి...?*



CK న్యూస్ ప్రతినిధి


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల పంచాయతీలో ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్న దళారులు అంతా మా ఇష్టం అన్నచందంగా తయారయింది.

ఇసుక దళారులు వారి స్వలాభం కోసం చింతిర్యాల రోడ్డు ని అస్తవ్యస్తంగా తయారుచేసి ఆటో గాని టూవీలర్ గాని ఎమర్జెన్సీ లో పేషెంట్ లని తీసుకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు మూడు పంచాయతీల గ్రామ ప్రజలు. 


24 గంటలు సుమారు 40 నుంచి 50 టన్నులు మేరకు ఇసుక లారీలు రోడ్డుపై తిరగటం వలన రోడ్లు పాడైపోయి చాలా ఇబ్బంది పడుతున్నాము అంటున్న చింతిర్యాల గ్రామస్థులు.


ఇక్కడ ఉన్న టిఎస్ఎండిసి అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకునే పరిస్థితి లేదు అని రైతులు ప్రజలు ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్ ని మారోడ్డు పాడైపోయింది మా పొలాలు పాడైపోతున్నాయని ట్యాంకర్ పెట్టి వాటర్ కొట్టించమని పలుమార్లు వారికి విన్నవించిన  ఎటువంటి స్పందన లేకుండా మా ఇష్టం మేము అందరితోని మాట్లాడుకున్నాం వారికి చేరవలసినవి చేరినాయి మీరు చెప్తే మేము వినేదేంటి అంతా మా ఇష్టం రోడ్డుకి టాక్స్ కడుతున్నాం ప్రజా ప్రతినిధులతో మాట్లాడుకున్నాము రోడ్డు పాడైపోతే అధికారులను ప్రజాప్రతినిధులను ప్రశ్నించుకోండి మీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటున్న సదరు బినామీ కాంట్రాక్టర్  అంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నా  ప్రజాప్రతినిధులు గాని స్థానికంగా ఉన్నటువంటి మండల అధికారులు గానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.


జిల్లాస్థాయి అధికారులైన మా యందు దయంచి మా గ్రామాలకు వచ్చే రోడ్డును బాగు చేయించి అనునిత్యం సుమారు 40 నుంచి 50 లారీలు అధిక లోడు వేసుకొని తిరుగుతున్నటువంటి ఇసుక లారీలపై స్థానికంగా ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకొని మా పొలాలు పాడవకుండా ఆటోలు కారులు  టూవీలర్స్  వెళ్లే విధంగా సదరు కాంట్రాక్టర్ ని రోడ్డు మంచిగా చేయించి పై అధికారులు చర్యలు తీసుకోమని కోరుకుంటున్న చింతిర్యాల గ్రామ ప్రజలు...

Comments