అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మార్పు సర్పంచ్ విజయశాంతి.........
సీకే న్యూస్ ప్రతినిధి మధిర( అక్టోబర్ 11):
తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటుతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఆ సర్పంచ్ .ఆ తపనే దెందుకూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది.ఈ అభివృద్ధిలో దెందుకూరు గ్రామ ప్రజలు కీలకపాత్ర వహిస్తున్నారు అంటున్నారు సర్పంచ్. కోట విజయశాంతి మూడున్నర ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని అన్నా రు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని ఏర్పాటు,తడి చెత్త,పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్కు తరలింపు, ,మనఊరు- మనబడి కార్యక్రమం ద్వారా( హెచ్ డబల్యూ) ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛనులతో కలిపి 689 పింఛన్లు గ్రామంలో పంపిణీ చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తెలియజేసినారు గ్రామపంచాయతీ నిధులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, నిధులు ద్వారా సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అన్నారు, రైతుబంధు,రైతుబీమా ద్వారా రైతులందరూ లబ్ధి పొందుతున్నారు అన్నారు.,,
హరితహారంలో భాగంగా గ్రామంలో 4000 మొక్కల నాటామన్నారు.ప్రతి మొక్కకు ట్రీ గాడు ఏర్పాటు చేసి వాటి సంరక్షణ బాధ్యతలు గ్రామపంచాయతీ తీసుకుంటుంది.పల్లె ప్రకృతి వనం నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గ్రామ ప్రజలకు కల్పించాం. ప్రతి మంగళ,శుక్రవారం పారిశుద్ధ్యంలో భాగంగా అధికారులతో కలిసి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయి.. గ్రామంలో పి హెచ్ సి హాస్పిటల్ కు రూములు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామంలో దహన సంస్కారాలకు ఇబ్బంది లేకుండా వైకుంఠధామ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎస్సీ స్మశాన వాటికలో 2 లక్షల రూపాయలతో బిల్డింగ్ రూమ్ ఏర్పాటు గ్రామంలో అభివృద్ధి పనులకు సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి,ప్రజలకు ప్ర త్యేక ధన్యవాదములు తెలియజేశారు.
Comments
Post a Comment