బతుకమ్మ సాక్షిగా ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాడుదాం

 బతుకమ్మ సాక్షిగా ఇళ్ల స్థలాలు  ఇచ్చేవరకు పోరాడుదాం...



 - వ్యవసాయ కార్మిక సంఘం

   రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

   బొప్పని పద్మ


సి కె న్యూస్ జుక్కల్ ప్రతినిధి 


తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింలుఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో జరుగుతున్న భూ పోరాట కేంద్రంలో   నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మాట్లాడుతూ ఆడ పిల్లలను పుట్టనిధం ఎదగనిద్దాం  అని నినాదాలు ఇచ్చారు

 పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్న ఈ ప్రాంతానికి మల్లు స్వరాజ్యం పేరును నామకరణం చేశారు ప్రకటించారు బతుకమ్మ అంటే బతుకు అమ్మ బతుకునిచ్చే అమ్మ అని అన్నారు దేశంలో రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి సమాన హక్కులు ప్రభుత్వాలు కనిపించడంలో విఫలమయ్యాయని అన్నారు. ఈరోజు ఈ బతుకమ్మ సాక్షిగా స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు ప్రజాపోరాటాలకు ప్రభుత్వాలు తలవంచని వీరి సమస్యలు పరిష్కరించకుంటే  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ సంబరాల్లో బాల్రాజ్ గౌడ్ అర్జున్ ప్రవీణ్ దేవరాజు భూమయ్య ఉమా శంకర్ పేరం నరసవ్వ యాదమ్మ ఎల్లమ్మ శేఖర్ నాగమణి రాజమణి వెంకటమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నరు.

Comments