మునుగోడు ప్రచారానికి మంత్రి పువ్వాడ

 మునుగోడు ప్రచారానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్


మంత్రికి కీలక బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కేసిఆర్


మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసిఆర్ కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు మంత్రి పువ్వాడను మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ఇంఛార్జిగా నియమించారు.

తన వాక్చాతుర్యంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముప్పుతిప్పలు పెడతారని గమనించిన అధిష్టానం ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. 

ఇప్పటికే గతంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంఛార్జి బాధ్యతలను ఇచ్చి ప్రచారంను హోరెత్తించి పార్టీ విజయానికి కృషి చేశారు ఆనాడు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి విజయఢంకా మోగించింది.

రాజకీయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుసరిస్తున్న విధానం, తన చాణక్యం, వ్యూహలకు ప్రతివ్యూహాలు రచనలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని ఆ పార్టీల నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.

ఇక సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మునుగోడు మండలంలోని కొరిత్కల్, దుబ్బకాల్వ గ్రామాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పర్యటించనున్నారు. 

గురిపెట్టిన బాణంలాంటి వ్యూహం, కాలాన్ని సైతం మార్చగల కర్తవ్యం, మంత్రముగ్ధం చేసే మాట, పరిణత, ఉద్దండుల్ని మించిన రాజకీయ చతురత ఇవన్నీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లో మెండుగా ఉన్నందున కేసిఆర్ సైతం ఆయనకు ఎన్నికలో కీలక బాధ్యతలను ఇచ్చారు.

Comments