లంబాడీల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం...

*లంబాడీల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం...*


CK న్యూస్ ప్రతినిధి



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం

గిరిజన ఆదివాసీ లు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ పెంపుపై  తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు జీఓ నెంబర్ 33ద్వారా దసరా పండగ కానుకగా 10%రిజర్వేషన్ ఇవ్వడం పై గిరిజనుల కల సాకారం కావడంతో క్రుతజ్ఞతగా శనివారం బూర్గం పహాడ్ మండలం సారపాక గాంధీనగర్ తండా నాయక్ బర్మావత్ కిషన్ నాయక్ పిలుపు మేరకు మార్కెట్ బోర్డు డైరెక్టర్ బాణోతు శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగింది.


ఈ పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బూర్గం పహాడ్ జడ్పీటీసీ శ్రీలత మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి హాజరై లంబాడీ కుల పెద్దల చేతులు మీదుగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.


 అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ గిరిజన పక్షపాతి అని గిరిజన అభివృద్ధి కి కట్టుబడి ఉన్నారని దానికి నిదర్శనం బంజారాహిల్స్ లో బంజార ఆదివాసీ భవనాలు నిర్మించడం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం తండాలు గూడాలు ప్రత్యేక పంచాయతీ లుగా ఏర్పాటు చేయడం అతి త్వరలోనే అటవీ భూముల కు పట్టాలు కూడా అందిస్తారని అన్నారు.


 తండా నాయక్ కిషన్ నాయక్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ పెంపుతో గిరిజనుల కల సాకారం అయినా గత 8 ఏళ్లుగా ఈ 10% రిజర్వేషన్ లేకపోవడంతో విద్య ఉద్యోగు విభాగంలో సుమారు 10000మంది నష్టం వాటిల్లిందని ఈ పది వేల పోస్ట్ లకు సూపర్ న్యూమరరి పోస్టుల ద్వారా బర్తీ చేయాలని కోరారు. 


ఈ రిజర్వేషన్ పెంపు విషయంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ కి స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఈకార్యక్రమంలో తండా సేక్సింది హర్జ నాయక్ టీఆరెస్ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు జలగం జగదీశ్ టౌన్ అధ్యక్షుడు కొనకంచి శ్రీను మాజీ యంపీటీసి సభ్యులు భూక్య భీమ్ల మాజీ వార్డు సభ్యులు మూడ్ శ్రీను నాయక్ భూక్య బాలకృష్ణ భూక్య చిరంజీవి భూక్య క్రుష్ణ కుమార్ టీఆరెస్ నాయకులు తుపాకుల రవి కుమార్ దాసరి వెంకటరమణ ఐటీసీ గుత్తేదారు తిరుపతి ఏసోబు టౌన్ యూత్ అధ్యక్షుడు సోము లక్ష్మీ రెడ్డి మణి తండా మహిళలు తదితరులు పాల్గొన్నారు...

Comments