కెసిఆర్ కిట్ పైసల్ కట్...?

 *కెసిఆర్ కిట్ పైసల్ కట్...?*


- లబ్ధిదారులకు అందని

   చేయుట

- అమ్మ ఒడిపై నిర్లక్ష్యమేలా..

- నిధులు అందని మాట

  వాస్తవమే....!

- బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి

  సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్





సి కె న్యూస్ కామారెడ్డి ప్రతినిధి


నిరుపేద గర్భిణులు ప్రసవాల కోసం ప్రైవేట్ అపుత్రులను ఆశ్రయించి, వేలాది రూపాయాలను ఖర్చు పెరుతూ.. అప్పుల ఊబిలోకి కూరుక పోతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత శిశు మరణాలు తగ్గించి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి 2017లో అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని వల్ల ప్రైవేట్ అస్పత్రులను వదిలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచగలిగారు. మాత శిశు మరణాలను చాలా వరకు తగ్గిపోయాయి. కేసీఆర్ కిట్ నిరుపేద మహిళలకు వరంగా నిలిచింది. ఈ పథకం ప్రారంభమైన రెండేళ్ల పాటు సజావుగా పథకం అమలు సాగింది. కేసీఆర్ కిట్తో పాటు కొంత నగదును తల్లి పేరిటా బ్యాంకులో జమ చేశాడు. ఈ ఆర్ధిక సహాయం బాలింతలకు పౌష్టికాహారం తీసుకోవడానికి ఇచ్చిన సహాయం. కానీ, ప్రస్తుతం ఏడు నెలలుగా అమ్మ ఒడి పథకంపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకున్న మహిళలకు, గర్భిణీలకు పుట్టిన శిశువులకు కేసీఆర్ కిట్ ద్వారా అండాల్సిన సహాయం నిలిచి పోవడంతో, ఎంతో మంది నిరుపేద మహిళలు ఇబ్బందుల పాలు అవుతున్నారు. గర్భిణీలు, నవ జాత శిశువు సంక్షేమం కోసం తెలంగాణ సీఎం చంద్ర శేఖర్ రావు కేసీఆర్ కిట్ పథకాన్ని 2017లో ప్రారంభించారు. నవజాత శిశువులు, వారి తల్లులకు, తల్లి, పిల్లల సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ ద్వారా ఉత్పత్తులను అందిస్తున్నారు. శిశువుకు మూడు నెలల వరకు రూ.12వేలు ఆర్థిక సహాయం అంద చేస్తారు. మొదటి రూ. 4వేలు, ప్రసవం తరువాత రెండో విడతగా మరో రూ. 4వేలు, శిశు పుకు టీకా సమయంలో మరో రూ. 4వేలు, అమ్మాయి అయితే అదనంగా మరో రూ. వెయ్యిని తల్లి, శిశువుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అంద చేస్తారు.


కేసీఆర్ కిట్ లో ఉండే సామాగ్రి...


ప్రత్యేక తల్లి, చైల్డ్ కేర్ సబ్బు, నవజాత శిశువు మంచం, బేబీ ఆయిల్, తల్లి కోసం చీరలు, చేతి సంచులు, టవల్, నాప్కిన్స్, శిశువు కోసం డ్రస్సులు, చిన్న పిల్లల ఫొడర్, డైపర్లు,  బేబీ షాంపు, కిడ్ టాయ్స్ వస్తువులను కేసీఆర్ కిట్ ద్వారా తల్లి, శిశువులకు అందిస్తున్నారు.


పథకానికి అర్హులు ఎవరూ...?


ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలు, గరిష్టంగా రెండు ప్రసవాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన లబ్దిదారులై ఉండి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంటేనే కేసీఆర్ కిట్టుకు అర్హత సాధిస్తారు. లబ్ధిదారుడికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఈ పథకానికి అనర్హులు. జూన్ 2, 2017 కు ముందు ప్రసవాల కోసం లబ్దిదారుడు ప్రభుత్వేతర ఆస్పత్రుల నుంచి చికిత్స తీసుకుంటే లబ్దిదారుడి ఆధార్ కార్డు తెలంగాణ రాష్ట్రానికి చెందినది. కాకపోతే అది నమోదు కాదు. లబ్దిదారులు తమ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేదా ఆశ కార్యకర్త వద్ద పేర్లను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎఎన్ఎం చేత చేస్తారు. డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది.


పథకం అమలు సజావుగా సాగడం లే...


ఈ పథకం ద్వారా శిశువుకు మూడు నెలలు వచ్చే లోపు రూ. 12వేల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులు ప్రయోజనం పొందుతారు. కానీ, ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్టుపై అందిస్తున్నప్పటికీ, అమ్మ ఒడి పై నిర్లక్ష్యం అలుము కోవడంతో ఏడు నెలలుగా


 అమ్మ ఒడి నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం అందక పోవడంతో ఎంతోమంది నిరుపేద మహిళలకు పౌష్టికాహారం అందడం గగనమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకుంటే వచ్చే అమ్మ ఒడి పథకం ప్రయోజనాలు బాలింతలకు, గర్భిణులకు, శిశువులకు అందక పోవడంతో వాటి కోసం రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ఏడాదిన్నరగా నీరిక్షిస్తున్నారు. మొట్టమొదటి సారిగా కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టినప్పుడు పాలకులు, అధికారులు ఎంతో గొప్పగా వేధికలపై విడతగా గర్భిణీలకు


బిడ్డకు తల్లి కి ప్రభుత్వ ఆసుపత్రుల - ప్రసవం సురక్షితం:


దాటి చెప్పినప్పటికీ, అది ప్రస్తుతం ఆచరణ కావడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఈ అమ్మ ఒడికి కావాల్సిన విధులను వైద్య శాఖకు ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో ఆర్ధిక సహాయం కోసం మహిళలు నిరిక్షిస్తూ.. ముఖ్యమంత్రి గారూ మాపై కరుణించందని వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఇప్పటికే అధికారుల నుంచి ప్రభుత్వానికి అమ్మ ఒడి పథకం ద్వారా రావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ ఏడాదిన్నరగా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్య శాఖలు దృష్టి పెట్టక పోవడం శోచనీయం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, పాలకులు స్పందించి, నిలిచి పోయిన అమ్మ ఒడి పథకానికి నిధులను కేటాయించి, నిరుపేద మహిళలను ఆదుకుంటూ.... ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడమే. కాకుండా మాతా శిశు మరణాలను అరికట్టే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



నిధులు అందని మాట వాస్తవం


బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్

శ్రీనివాస ప్రసాద్


అమ్మ ఒడికి అందించవలసిన ఆర్థిక సాయం విషయంపై బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ను సికే న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా నిధులు అందని మాట వాస్తమని అంగీకరించారు. త్వరలో ఆన్లైన్ ద్వారా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు .

Comments