నా కార్యాలయం నా ఇష్టం
- అంతా తాను ఒక్కడే
ఏకచత్రాధిపతి...!
- విధులు నిర్వహించే
సిబ్బందికి చుక్కలే..?
- మా ఇష్టం, మా మేడం ఇష్టం
వచ్చినప్పుడు వస్తారు ...!
- దబాయిస్తున్న అటెండర్ ...?
- విధుల పట్ల నిర్లక్ష్యం...?
- సబ్రిజిస్ట్రారు కార్యాలయ
అటెండర్ ......?
- సమయానికి తెరవని సబ్
రిజిస్టర్ కార్యాలయం ...?
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ సమయపాలన పాటించక ఇష్టం వచ్చిన రీతిలో తనకు నచ్చిన సమయంలో కార్యాలయానికి రావడం చెప్పిందే విధంగా తాను చేసింది శాసనంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది అంతా తనొక్కడే బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నాం అనె ముసుగులో కార్యాలయ సిబ్బందిని తన గ్రిప్ లో పెట్టుకున్న వైనం దీనికి తోడు మిగతా సిబ్బంది వత్తాసు పలకడం గమనార్హం అని చెప్పవచ్చు.. వివరాల్లోకి వెళితే
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేసే అటెండర్ దబాయిస్తూ మా కార్యాలయం మా ఇష్టం అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉదయం 10:00 దాటి పోయినా కార్యాలయాన్ని తెరవలేదు. కార్యాలయానికి విధులపై వచ్చిన సిబ్బంది సైతం బయటనే కూర్చుండిపోయారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పని చేసే అటెండర్ అన్నీ తానై వ్యవహరిస్తూ, కార్యాలయ సిబ్బంది సమయానికి వచ్చిన అటెండర్ రాకపోవడంతో కార్యాలయం బయటనే పడిగాపులు కాస్తున్నారు. సదరు అటెండర్ నిజామాబాద్ జిల్లా నుండి ప్రతి రోజు కామారెడ్డికీ వస్తూ పోతూ ఉండడంతో తోటి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థలాలు, గృహాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వారు సైతం వీరి కోసం ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
రెవెన్యూ స్టాంపులు, బాండ్ పేపర్లు కావాలన్నా వారు వీరు వచ్చే వరకు వేచి చూడవలసి వస్తుంది అని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి తోడు సబ్ రిజిస్టర్ 11:30 నిమిషాల వరకు వస్తుండడంతో ఎవరైనా ఆలస్యం ఎందుకు అవుతోందని అడుగుతే కార్యాలయాన్ని మార్పు చేసేది ఉన్నందున అక్కడికి వెళ్లి వస్తున్నాను అని చెప్పడం సాకుగా తయారైందని కార్యాలయానికి వచ్చే వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకొని కార్యాలయం సరిగ్గా నిర్వహణ కొనసాగించాలని కోరుతున్నారు. ఈ విషయంపై సబ రిజిస్టర్ ని వివరణ కోరగా సదరు అటెండర్ నరేష్ తీరు ప్రవర్తనపై, విధుల పట్ల నిర్లక్ష్యతపై డిస్టిక్ సబ్ రిజిస్టర్ కి తెలిపి మెమోలు అందజేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దృష్టి పెట్టి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహణ మరియు అక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Post a Comment