ఆదర్శ పాఠశాలలో చితకబాదిన ఉపాద్యాయురాలు
- గాడితప్పిన విద్య వ్యవస్థ
- విద్యార్థులను చితక బదుడు
- స్వేచ్ఛ విద్య నేర్పాల్సినటీచర్
విచక్షణ కోల్పోవడం..!
- చర్యలు తీసుకోవాలని
విద్యార్థి సంఘాల డిమాండ్
- జిల్లా అధికారులకు ఫిర్యాదు
చేసిన చర్యలు శూన్యం...
- పర్యవేక్షణ లోపం
- పరిస్థితి పై తల్లిదండ్రులు
ఆందోళన....
- తక్షణమే టీచర్ పై చర్యలు
తీసుకోవాలి...!
- ప్రిన్సిపాల్ పై కటిన చర్యలు
తీసుకోవాలి...?
- సరిహద్దులో విద్య వ్యవస్థ
బలోపేతం చేయాలి....!
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండల కేంద్రంలోని మెనుర్ గ్రామంలో ఆదర్శ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాల లో మంగళవారం మేనుర్ పాఠశాలలో టీచర్ ఆగయిత్యం వలన విద్యార్థులపై జరిగిన ఘటన, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా విద్య బుద్ధులు విద్యార్థులకు పాఠ్య పుస్తక జ్ఞానము అందించి బావి పౌరులుగా చిర్చిదిద్దాలసిన ఉపాధ్యాయురాలు విచక్షణ రహితంగా విద్యార్థినిలను కొట్టడం జరిగింది. పాఠాలు చెప్పాల్సిన టీచర్ కోపం తో సుమారు 18 మంది విద్యార్థినిలను క్లాస్ రూమ్ లో నిల బెట్టి వారిని కర్ర తో కొట్టడం తో విద్యార్థినీలు బాధను వ్యక్తం చేశారు. అంతేగాక వారిలో కొందరు సామాజిక మాధ్యమం లోని వాట్సాప్ ద్వారా ఉపాద్యాయురాలు విద్యార్థినియులను చితకబాదుతున్న వీడియో క్లిప్ లు బయటకు సామాజిక మాధ్యమం ద్వారా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం తో చూసిన వారు విద్య నేర్పించి మంచి మార్గం దారి చూపెట్టే ఉపాధ్యాయులు ఆడ పిల్లలకు ఇలా క్లాస్ రూములలో కొట్టడం చూసి అవాక్కయ్యారు . విద్యార్థినియులకు కొట్టిన ఉపాద్యాయురాలు పై తక్షణమే జిల్లా అధికారులు చర్యలు తీస్కొని సస్పెండ్ చేయాలని పలువురు చర్చించుకుంటున్నారు .
మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆదర్శ మోడల్ పాఠశాల మరియు కాలేజి పై జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ విదులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు , పాఠశాల ప్రిన్సిపాల్ యొక్క పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్చుకుంటున్న విద్యార్థులకు విద్య అందక వేరే పాఠశాలలకు టీ.సి. లు తీస్కొని వెళ్లిపోవడం జరుగుతుందని పలువురు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ విదులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ పై పలు మార్లు స్థానికులు ఫిర్యాదులు చేసిన జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగా చర్యలు తీస్కొకోక పోవడం మూలంగా మెనూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల పరిస్థితి దయనీయంగా మారడం జరిగిందని స్థానికులు, విద్యార్థి సంఘాలు తెలపడం జరుగుతుంది . విద్యార్థినియుల పట్ల ఒక ఉపాద్యాయురాలు క్లాసులో విద్యార్థుల ముందర విద్యార్థినిలను కర్రతో ఇష్టం వచ్చినట్టు ఒంటిపై ఇష్టమొచ్చినట్టు బట్టలుడి పోయేలా ఎక్కడపడితే అక్కడ కర్రతో కొట్టడం తో విద్యార్థిలు ఏడవడం తో పాటు మానసికంగా లోనవడం జరిగింది. విద్యార్థినిలను ఉపాద్యాయురాలు క్లాస్ రూములో కొట్టడం తో వాట్సాప్ ద్వారా వైరల్ అవుతున్న వీడియోలను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందటం జరుగుతుంది . పేరుకే మోడల్ పాఠశాల అని పలువురు తల్లిదండ్రులు ప్రాధేయ పడుతున్నారు. విద్యార్థులకు , విద్యార్థినిలకు మంచి విద్య అందించి వారి యొక్క భవిష్యత్తు జీవితాలను విద్య ద్వారా తీర్చిదిద్దాలసిన ఉపాధ్యాయులకు చెప్పె వారు లేకపోవడం జిల్లా మండల, అదికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వలన ఇలాంటి అఘాయిత్యం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మోడల్ పాఠశాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు నెలపాలు కావడం జరుగుతుంది .తక్షణమే ఇక్కడ ప్రిన్సిపాల్ గా విదులు నిర్వహిస్తున్న వారిని స్థానచాలనం చేసి మరో ప్రిన్సిపాల్ ను ఇక్కడ నియమించాలని మండల వాసులు కోరడం జరుగుతుంది . ప్రత్యేకంగా జిల్లా విద్య అధికారి నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర సరిహద్దు లో ఉన్నటువంటి విద్య వ్యవస్థలు కుంటుపడుతున్న దృశ్యాలు స్పష్టంగా ఏర్పడటం జరుగుతుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Post a Comment