సమస్యలే ప్రధాన అజెండాగా పాదయాత్ర

సమస్యలే ప్రధాన అజెండాగా

పాదయాత్ర:  సామాజిక కార్యకర్త కర్నె రవి


సికె    న్యూస్ ప్రతినిధి మణుగూరు 



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో మున్సిపాలిటీ   నాలుగవ  రోజు పాదయాత్ర కొనసాగించిన సామాజిక కార్యకర్త కర్నె రవి, మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ

సమస్యలే ప్రధాన అజెండాగా పాదయాత్ర

మణుగూరు  మున్సిపాలిటీనీ మణుగూరు గ్రామ పంచాయతీగా మార్చాలని వినతి  100 రోజుల పని కల్పించాలంటూ వేడుకోన్న గ్రామస్తులు  మణుగూరు మున్సిపాలిటీలోని బాపనకుంటు, శివలింగంపురం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురికి నీరు నిల్వ ఉండి మలేరియా జ్వరాలు వస్తున్నాయని ఊరు చివర ఉండటం వల్ల పందులు, కుక్కలు నిలయాలుగా మారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నామని సామాజిక కార్యకర్త కర్నె రవికి, మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గకు తెలిపారు. 

మణుగూరు మున్సిపాలిటీ సమస్యపై గలమెత్తిన సామాజిక కార్యకర్త కర్నె రవి, మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గ నాలుగవ రోజు పాదయాత్ర కొనసాగించారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని బాపన కుంట, శివలింగాపురం ప్రధాన రహదారిపై సైడ్ డ్రైనేజీ లేక,  నల్లా కనెక్షన్ కోసం రోడ్లు ఇష్టం వచ్చినట్లు సిసి రోడ్లను తవ్వి రాత్రిపూట ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులు   పడుతున్నారని గ్రామస్తులు తెలియజేశారు. 

మణుగూరు మున్సిపాలిటీ అవడం వల్ల మాకు ఉపాధి హామీ పథకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బాపును కుంట, శివలింగం పురం గ్రామాలకి అడవికి దగ్గర ఉండటం వల్ల వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి వస్తున్నాయని,  గ్రామంలో సైడ్ డ్రైనేజీ వ్యవస్థ లేవని మొదటి, రెండు, మూడు, నాలుగు, పట్టణ ప్రగతి పథకంలో ఏర్పాటు చేసిన పార్క్ లో నిధుల దుర్వినియోగం చేయడం తప్ప అభివృద్ధి జరిగిందేమీ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.

 గ్రామంలో రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, నల్ల కనెక్షన్, వీధిలైట్లు లేవని, అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అభివృద్ధి అనేది శూన్యం అని ప్రజలు అంటున్నారు. మున్సిపాలిటీ ప్రజలు మణుగూరు మున్సిపాలిటీనీ మణుగూరు గ్రామ పంచాయతీగా మార్చాలని, ఉపాధి హామీ పథకం కావాలని కోరుతూ సామాజిక కార్యకర్త కర్నె రవికి, మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గకు విన్నవిస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గా, గుగులోతు రమేష్, నాగార్జున రెడ్డి, పప్పులు వరదర్శ,కమటం భాస్కర్,బండి జగదీష్, దారజు నాగేష్, సురేష్, మొదలగు వారు పాల్గొన్నారు.

Comments