సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి

 సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి.


సికె  న్యూస్ ప్రతినిధి  మణుగూరు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా 

 ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు జెల్లా.అశోక్,


 సింగరేణి యాజమాన్యం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు జెల్లా.అశోక్ సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. మంగళవారం ఓసి 4 లో జరిగిన కన్వీనియన్స్ వాహన డ్రైవర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని, ఇతర చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తే కొన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఒప్పందం చేసుకొని రెండు నెలలు కావస్తున్నా సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఒప్పందాన్ని అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు. 

వేతనాల పెంపు విషయంలో కూడా ఒక కమిటీ వేసి అధ్యయనం చేస్తామని, రెండు నెలల్లో వేతనాల పెంపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సింగరేణి యాజమాన్యం రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు దాని గురించి పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని, సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మరో  ఆందోళన తప్పదన్నారు.

    ఈ సమావేశంలో ధనరాజ్, విజయ్, శ్రీను, శివ, అన్నవరం, చిట్టిబాబు, ఖలీల్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments