బహుళ అంతస్థులకు అడ్డుకట్ట పడదా...?
మేజర్ గ్రామపంచాయతీ సారపాకలో విచ్చలవిడిగా బహుళ అంతస్తుల నిర్మాణం...
కలెక్టర్ ఆదేశాలు కూడా బేకాతలు చేస్తున్న నిర్మాణదారులు...?
పంచాయతీ నోటీసులను లెక్కచేయకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగింపు...?
CK న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక లో రోజురోజుకీ జనాభా వలసలతో జనాభా పెరుగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి ప్రాంతాల్లో భూములకు అమాంతంగా రెక్కలు వచ్చి కోట్లల లో ధరలు పెరగటం జరిగింది.
1/70 యాక్టివ్ ఈ ప్రాంతంలో ఉందా? అమలుకు అవకాశం కనిపిస్తుందా అనే అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి.
అధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.?
ఈ బహుళ అంతస్థులకు చెక్ పెట్టలేరా? అధికారులకే సవాల్ విసురుతున్న ఎందుకు మిన్నకుంటున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.?
వీరి వెనక ఏ బడాబుబూ ఉన్నారో.?
ఎవరి అంగ బలంతో అండ బలంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయో.?
అధికారులు నామమాత్రపు చర్యలకు ఎందుకు శ్రీకారం చుడుతున్నారు క్షేత్రస్థాయిలో తగిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.?
బహిరంగ ప్రాంతాల్లో బహుళ అంతస్తులు నిర్మాణానికి అనుమతులు లేవన్న సంగతి తెలుసు ప్రధాన రహదారి ప్రాంతంలో బహిరంగంగా ఎటువంటి భయము లేకుండా నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారు ఇదంతా పంచాయతీ అధికారులు కనుసనల్లోనే జరుగుతుందా.?
ఈ గ్రామంలో పలుచోట్ల పంచాయతీ అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి.?
ప్రభుత్వ ఆదేశాలు బహుళ అంతస్తులు నిర్మానించే బడా బాబులకు వర్తించవా.?
సామాన్యుడు బహులంతస్తు కట్టుకోవాలంటే అనేక ఆంక్షలు.?
అటువంటి ఆంక్షలు బడా బాబులకు అవసరం లేదా...?
Comments
Post a Comment