పార్టీ కార్యకర్తలు అందరూ సైనికుల్లా పని చేయాలి మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య
ఈరోజు క్యాంపు కార్యాలయం కూసుమంచి నందు కూసుమంచి మండల టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరయ్య, మహమ్మద్ ఆసిఫ్ పాషా, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్, సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, ఆత్మ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మాట్లాడుతూ రాబోయే ఎన్నికల కోసం పార్టీ నాయకులు ఇప్పటినుండే సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా చేరవేయాలని, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని అన్నారు.
కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటరుగా నమోదు చేసే బాధ్యతను తీసుకోవాలని అన్నారు, బూత్ కమిటీ ఇన్చార్జ్ లను అలాగే బూత్ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు, పార్టీ గ్రామ శాఖలు మరియు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలానికి చెందిన అన్ని గ్రామ శాఖల అధ్యక్ష కార్యదర్శులు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Post a Comment