తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ని కలిసి మెమోరాండం అందించిన మద్దిశెట్టి సామేలు మరియు ఎండీ. ఫయాజ్.

 తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ని కలిసి మెమోరాండం అందించిన  మద్దిశెట్టి సామేలు మరియు ఎండీ. ఫయాజ్.


భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లోని రాజభవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది.



ప్రధానంగా నాలుగు సమస్యల  మీద గవర్నర్ గారిని కలవడం జరిగింది.


1.ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు సంబందించి 2005 కంటే ముందు నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా హక్కులు కల్పించాలని, ఫారెస్ట్ అధికారుల నుండి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడాలని, పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరడం జరిగింది.


2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సొంత స్థలం ఉన్నవారికి 3 లక్షల రూపాయలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని కోరడం జరిగింది.


నాలుగు జిల్లాల్లో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తూ 1,25,000 మందితో ఆర్గనైజేషన్ నడిపిస్తున్న నాపై దాడులు చేయాలని, అక్రమ కేసులు పెట్టాలని, హత్య ప్రయత్నాలు చేస్తున్నా 8 మందిపై గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.


భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు, భారత ప్రభుత్వ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ FAF శ్రీ రామ్ కుమార్ వాలీయ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి రాసిన లేఖను ఈరోజు గవర్నర్ గారికి అందజేయడం జరిగింది.


BSSM కి సంబందించి ఆర్గనైజేషన్ లో పని చేస్తున్న కార్యకర్తలపై కొంతమంది వ్యక్తులు దాడులు చేయాలని, అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.


4.చిన్న, సన్నకారు రైతులకు రైతు బందు వర్తింపు చేయాలని, రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరడం జరిగింది.


5. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులకు రోడ్లు, కరెంట్, మంచినీరు, డ్రైనేజీలు, స్కూళ్లు, పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరడం జరిగింది.


గవర్నర్ గారు మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులకు లేఖ రాస్తానని, ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ. ఫయాజ్, కూసుమంచి మండల అధ్యక్షులు బానోత్ రవి, అస్లామ్, ఎండీ. అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


Comments