*పందుల పెంపకానికి అడ్డాగా మారిన మధిర మున్సిపాలిటీ.*
*ప్రజల సమస్యలు పట్టించుకోని కమిషనర్ మాకొద్దు అంటున్న ప్రజలు*
*కమిషనర్ పై కలెక్టర్, మంత్రికి కేటీఆర్ కి, mla గారికి ఫిర్యాదు చేయటానికి సిద్ధంగా ఉన్న ప్రజలు*
ఈ వీడియో ఏదో పందుల ఫామ్ లోది అనుకుంటే మీరు పొరపడినట్టే మధిర నడి బొడ్డు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం వేల సంఖ్యలో ప్రజలు, స్కూల్ కి వెళ్లే విద్యార్థులు తిరుగుతూ ఉండే రహదారి. ఇప్పుడు అది పందుల అడ్డాగా మారిపోయింది. పేరుకు ఉత్తమ మున్సిపాలిటీ కానీ ప్రజలకు అందించాల్సిన సేవలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి, మధిర మున్సిపాలిటీ లో కుప్పలు తిప్పలుగా పందులు తిరుగుతున్న పట్టించుకోని కమిషనర్, పాలకవర్గం.. మధిర మున్సిపాలిటీ పరిధిలోని లడకబజార్ 18 డివిజన్ బంజారా కాలనీ,రాజీవ్ నగర్ 21 డివిజన్ పందులమయంగా మారిపోయింది.
కమీషనర్ గారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు, పందుల వారిని పిలిచి కమీషనర్ గారు చెప్పిన వారు పట్టించుకోలేదంటే కమిషనర్ గారి మాటకి ఎంత విలువ ఉందో ప్రజలకు అర్థమవుతుంది. నామ మాత్రంగా పందుల పెంపకం దారులకు పై పైన చెప్పి *వాళ్ళతో లాలూచీ పడ్డారా* అని ప్రజలు అనుకుంటున్నారు.. *కనీసం పందుల పెంపకం దారులు కూడా కమిషనర్ గారి మాట పట్టించుకోనప్పుడు ఇలాంటి కమిషనర్ మాకు అవసరమా అని ప్రజలు అడుగుతున్నారు.* *మాకొద్దు ఈ కమిషనర్ వెంటనే మార్చేయండి* అని కలెక్టర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయటానికి సిద్ధంగా ఉన్నారు.. పట్టణంలో ఏ వీధిలో చూసినా పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. కనీసం పందులని కూడా అరికట్టలేని ఈ మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు....పోస్ట్ పెట్టిన రోజు హడావిడిగా తు తు మంత్రంగా ఆర్డర్ పాస్ చేయడం వెంటనే పందుల పెంపక దారులు ఒకటి రెండు పందులను పట్టుకొని ఫోటోలు పెట్టేసి కమిషనర్ గారు వెంటనే ఆ ఫోటో పెట్టి మధిర పందుల రహిత మున్సిపాలిటీ చేసేసాము.. అన్నట్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది కాదు కమిషనర్ గారు పెర్మనెంట్ గా పందుల నిర్మూలన చేపట్టండి తక్షణమే.. మీరు చేయలేకపోతే మీ వల్ల కాకపోతే. మీరు వెళ్లి పోండి ఇంకో కమిషనర్ ని తెచ్చుకుంటాం....
*ఆగ్రహం, ఆవేశాలతో మధిర పట్టణ ప్రజల కోరిక ఇది...*
Comments
Post a Comment