-సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ల సమస్యలు పరిష్కరించండి

 -సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ల సమస్యలు పరిష్కరించండి


 సి కె  న్యూస్ ప్రతినిధి  మణుగూరు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా 


    

 -సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ల సమస్యలు పరిష్కరించండి


సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ల పరిష్కరించాలని కోరుతూ ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో   ఏరియా సింగరేణి సెక్యూరిటీ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీ లాల్ మాట్లాడారు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా అనేక ఏజెన్సీలకు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లు విధులు నిర్వహిస్తున్నారనీ సింగరేణి సంస్థ ఆస్తుల కాపాడడంతో పాటు పై అధికారుల ఆదేశాల మేరకు పలు  కార్యక్రమాల్లో కూడా వీరు పర్మినెంట్ గార్డులతో సమానంగా పనిచేస్తూ సింగరేణి సంస్థకు సేవలందిస్తున్నారను ఇప్పటివరకు వీరికి మెడికల్ యంవీటికి సంబంధించిన ఖర్చులు వీరే భరిస్తున్నారు దీంతోపాటు కాంట్రాక్టర్లు మారిన ప్రతిసారి షూ యూనిఫామ్ ఇతర డ్రెస్ మెటీరియల్ కు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ల పేర కూడా వేలకు వేలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ విషయమై ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గతంలో కూడా పలు మార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇటీవల 26-9-2022 హైదరాబాదులో ఏఎల్ సి సమక్షంలో సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో మెడికల్ వీటిసికి యూనిఫామ్ కు సంబంధించి చేసుకున్న ఒప్పందం ప్రకారం కూడా   ఈ సమస్యలు పరిష్కరించాలని తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని కోరుతున్నాము వీటితోపాటు ఈ క్రింది సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని మనవి చేస్తున్నాము

      1) సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు మెడికల్ యంవిటిసి  ఖర్చులు సింగరేణి యాజమాన్యమే భరించాలి

      2) షూ యూనిఫామ్ ఇతర మెటీరియల్ కూడా సింగరేణి యాజమాన్యమే ఉచితంగా ఇవ్వాలి

      3) కరోనాతో మృతి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్ గ్రే షియా త్వరగా చెల్లించాలి 

      4) విధి నిర్వహణలో కానీ లేదా ప్రమాదవశాత్తు కానీ గాయపడిన లేదా దురదృష్టవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలు అనాధలు కాకుండా సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు చేయాలి, సింగరేణి కార్మికుల కు జాతీయ బ్యాంకులు అమలు చేస్తున్నట్లుగా వీరికి కూడా సంబంధిత స్కీములు వర్తింప చేయాలి.

      5) వైద్యం కొరకు ఈఎస్ఐ పథకం అమలు చేయాలి , వీరి పిల్లలకు సింగరేణి లో  ఉచిత విద్య అందించాలి

      6) ఖాళీగా ఉన్న క్వార్టర్లను ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు కేటాయించాలి 

      7) సిక్ లీవ్, క్యాజువల్ లీవ్ లు ఇవ్వాలి

      8) ఇటీవల మృతి చెందిన బుర్ర శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి 

   ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు రామ్ అవతార్,ఎం సుధాకర్ జి రాజశేఖర్ శేఖర్ బాబు కాసిం జి కరుణాకర్ వై ప్రభాకర్ రావు సాయిరాం కోటేశ్వరరావు ఎండి ఇమామ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు..

Comments