వైఎస్ శర్మిళమ్మ వెంటనే మేమంతా
-భద్రాచలం, పినపాక కో ఆర్డినేటర్లు
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
భద్రాచలం మండల అధ్యక్షుడు బత్తుల రాజు ఆధ్వర్యంలో సుభాష్ నగర్ కాలనీ లో జరిగిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు సమావేశంలో భద్రాచలం, పినపాక నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ప్రదీప్ కుమార్,కంది వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భద్రాచలం కో ఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార టిఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ఆటంకాలు చేస్తున్నారని, ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన వెనకడుగువేయకుండా ప్రజాసమస్యలపై గళమెత్తి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి శర్మిళమ్మ అని రాజన్న రాజ్యం మళ్ళీ తీసుకువస్తుంది అని తెలంగాణ రాష్ట్రానికి తొలిమహిళ ముఖ్యమంత్రి అవుతారు అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రజాప్రస్థానం పాదయాత్రలో శర్మిళమ్మ ప్రజలకు ఇచ్చిన హామీలను మరియొకసారి మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు సాయి. జీ రావు, పెంటపాటి. కామేశ్వర రావు, అవులూరు.సత్యనారాయణ, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ అక్బర్, కృష్ణా రెడ్డి,హేమచంద్ర,రాము,యస్వంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment