*అభివృద్ధికినోచుకోని ఖమ్మం తోగు*
సికె న్యూస్ ప్రతినిధి మణుగూరు భద్రాద్రికొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఖమ్మం తోగు గ్రామపంచాయతీలో ఈరోజు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురజాల గోపి పర్యటించారు. అక్కడి సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామస్తులు ఊరు పుట్టి వంద సంవత్సరాలు అయినా గాని ఇప్పటివరకు రోడ్డు సదుపాయం లేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించలేదు అత్యవసర పరిస్థితులలో వైద్యం చేయించుకోవాలంటే సదూర ప్రాంతమైన మణుగూరు కు వెళ్లాల్సి వస్తుందని రోడ్డు సదుపాయం కల్పించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు గోపి దృష్టికి తీసుకువచ్చారు.
గోపి గారు వారి సమస్యలను సావధానంగా విని ఐటిడిఎ పిఓ దృష్టికి మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఆదివాసి గిరిజనుల బిడ్డలైన ఖమ్మంతోగు బుగ్గ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే విన్నవించిన పట్టించుకోవడంలేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఖమ్మం తోగు బుగ్గ ప్రాంతం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని గోపి తెలియపరిచారు. సింగరేణి దత్తత గ్రామమైన ఖమ్మం తొగు అభివృద్ధికి సింగరేణి సంస్థ కృషి చేయాలని గోపి కోరారు
ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎండి షరీఫ్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి నూరుద్దీన్ మాజీ ఎంపీటీసీ పాల్వంచ రాములు ఉపాధ్యక్షులు పులిపాటి పాపారావు కోడం సాంబశివరావు బూర్గుల మోహన్ కిరణ్ జనరల్ సెక్రటరీ కంప రవి, సెక్రటరీ కుంజా రమేష్, కిషన్ నాయక్ శాబీర్, సతీష్ రాకేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..
Comments
Post a Comment