నిజాయితీ గెలిచిందన్న పాపకొల్లు గ్రామ ప్రజలు
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామపంచాయతీ నందు పోడు భూముల పట్టాల కొరకై దరఖాస్తు చేసుకున్న అర్హులైనరైతుల డిక్లేర్ చేయుటకై పాపకొల్లు పంచాయతీ ఆఫీస్ నందు మండల పరిషత్ అధికారి పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించటం జరిగింది ఈ గ్రామ సభకు ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ బాదావత్ లక్ష్మి ఎంపీటీసీ బానోత్ స్వాతి స్పెషల్ ఆఫీసర్ పోడు భూముల కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ ధారావత్ వెంకట్రాంగ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాపకొల్లు పంచాయతీ నుండి 116 దరఖాస్తులు రాగా వాటిలో రెండు దరఖాస్తులు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఒకటి ఊడల వెంకటేశ్వర్లు రెండు చిట్టి కళావతి అనే పేర్లపై సుమారు పది ఎకరాల పోడు భూమిని సుమారు 30 సంవత్సరాల నుండి ఊడల వెంకటేశ్వర్లు అనే రైతు పోడుకొట్టుకునే సాగు చేస్తుండగా కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో చిట్టి కళావతి అనే పేరు ప్రస్తావించి మాటకారి నాయకులు చిట్టి కళావతి తో అబ్జెక్షన్ అప్లికేషన్ పెట్టించినారు అది గమనించిన గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఇది అవాస్తవమని 300 మంది రైతులు ఓడల వెంకటేశ్వరరావు భూమి అని ఏకగ్రీవంగా నిర్ణయించినారు
నాదంటే నాది అని అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్లకై మండల పరిషత్ అధికారి గ్రామ పెద్దల సర్పంచు ఎంపీటీసీల పోడు భూముల కమిటీ సభ్యులు చైర్మన్ సమక్షంలో గ్రామసభ నిర్వహించారు గ్రామసభలో ఎంపీడీవో ఆదేశాల మేరకు గ్రామ ప్రజలను చేతులు లేపే కార్యక్రమాలను నిర్వహించినారు అట్టి నిర్వహణలో భాగంగా చిట్టి కళావతి పేరును ఎంపీడీవో గారు పిలవగా గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ పోడు భూముల కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఎవరు చేయి లేపలేదు అదే క్రమంలో ఊడల వెంకటేశ్వర్లు అనే రైతు పేరు పిలవగా సుమారు 300 మంది రైతులు ఏకగ్రీవంగా చేతులు లేపినారు అట్టి విషయంలో ఎంపీడీవో గారు ఏకీభవించి ఈ భూమి ఊడల వెంకటేశ్వరరావు దేనని నిర్ణయించినారు
Comments
Post a Comment