తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు తమ్మినేనికి లేదు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల శ్రీనివాస్
కూసుమంచి నవంబర్ 14
తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అనడం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అవివేకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు తమ్మినేనికి లేదని 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం అన్నారు.
మళ్లీ రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల అండతో ఈసారి ఏ పొత్తు లేకుండా పోటీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకన్న, గ్రామ నాయకులు దామల్ల బాబా రావు, తెలుగు యువత ఉప్పల ఉదయ్,గోవింద్, ఎల్లయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment