దళిత బంధుని వ్యాపారంగా మార్చిన తెరాస నాయకులు..!!
రెండో విడత దళిత బంధుకు మొదలైన బేరసారాలు
దళిత బంధు మంజూరు కోసం భారీస్థాయిలో ఒప్పందాలు
ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'దందా'
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం. రాష్ట్ర ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన 'దళిత బంధు' పథకానికి కొత్తగూడెంలో పైరవీలు జోరందుకున్నాయి. రెండో విడత దళితబంధు గైడ్ లైన్స్ విడుదల కాగానే పెద్ద సంఖ్యలో దళితులు నాయకుల వద్దకు వచ్చి చేరుతున్నారు. నియోజకవర్గానికి పదిహేను వందల యూనిట్లు మంజూరు చేయనుండడంతో ఎక్కువమంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరికివారే సిఫారసులు చేయించుకుంటూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి నేతలు ఎమ్మెల్యేను, ఆయన కుమారుడిని కలుస్తూ పైరవీలను చేస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడి హామీతో కిందిస్థాయి నేతలు రింగ్ గా ఏర్పడి పైరవీలకు తెర తీస్తున్నారు. తమకు ముందుగా 2 లక్షలు ఇస్తే దళిత బంధు సాంక్షన్ చేపిస్తామని దళితబంధు డబ్బులు వచ్చాక మిగిలిన 1లక్ష ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ విధంగా 2 లక్షలు ముందుగా ఇస్తేనే దళితబంధు మంజూరు అనేది ఎమ్మెల్యే కుమారుడి ఆజ్ఞగా చెప్తున్నారు. వేరే పార్టీకి చెందిన వారు ఎవరైనా వస్తే ఖరాఖండిగా పార్టీ కప్పుకొని పార్టీ మీటింగ్ కు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని స్వయంగా ఎమ్మెల్యే కుమారుడు హుకుం జారీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే కుమారుడిగా దళిత బంధు ఎంపిక బేరసారాలు.!
దళితబందు కింద ఈ యేడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉండడంతో గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువమంది దళితులు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల వారీగా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పథకం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా గైడ్లై లైన్స్ విడుదల కాగానే లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా తీసుకుని అధికార పార్టీకి చెందిన కిందిస్థాయి నేతలు పైరవీలకు తెరతీశారు. రెండో విడత గైడ్ లైన్స్ పూర్తికాగానే ఆ సిఫారసులను ఎమ్మెల్యేలకు ఇచ్చి మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతున్నారు. రెండో విడత అర్హుల ఎంపిక ఏ క్షణమైనా ప్రారంభం అవుతుందని ప్రచారం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేల అనుచరులు బేరసారాలు మొదలుపెట్టారు. మొదటి విడతలో తాము చెప్పిన వారికే పేరు దక్కిందని చెప్పి రెండో విడత ఎంపిక ప్రక్రియ ప్రారంభమవకముందే వసూళ్లను తెరతీస్తున్నారు. రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం అందుతుందనే ఆశతో కొందరు అడిగిన మొత్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. దళితబంధుకు కింద లబ్దిదారుల ఎంపిక అయితే 10లక్షల రూపాయలు వచ్చేస్తాయని దళితుల ఎదురు చూస్తున్నారు..
- దళిత బంధు మంజూరు కోసం భారీ స్థాయిలో ఒప్పందాలు..!
అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది దీనికి మొగ్గుచూపుతున్నారు. దళితబంధు మంజూరు కంటే ముందే డబ్బులు ఇచ్చేవిధంగా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాగితాలను కూడా తమకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా రాయించుకుంటున్నారు. దళిత బంధు ఎంపికయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేసే అవకాశం ఉంచడంతో ఆయా గ్రామాల్లో కొంతమందిని తప్పనిసరిగా ఎంపికచేయనుండడంతో ఇదే అదనుగా కిందిస్థాయి నేతలు ఈ పైరవీలకు తెరలేపారు. పైస్థాయి నేతలకు తెలియకుండానే ఈ ఒప్పందాలను ఉంది. కొనసాగిస్తున్నారు.
- ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దందా..!
దళిత బంధు ఎంపిక అధికారుల ప్రమేయం తక్కువగా ఉండడం రాజకీయ నేతలే ఎంపిక చేస్తుండడంతో గ్రామీణస్థాయిలో వారు కొంతమంది ఈ దందాకు తెర లేవుతున్నారు. రెండో విడత పై ఆశ పెట్టుకున్న దళితులతో ఎమ్మెల్యేల అనుచరులు చేరసారాలు జరుపుతున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఈ ఈతబందు కింద ఖర్చుచేస్తున్నందున పూర్తిగా దళిత బందు అబాసూ పాలు అవుతుంది..
Comments
Post a Comment