నియోజకవర్గానికి 19 కోట్ల 38 లక్షల నిధులు మంజూరు

 నియోజకవర్గానికి 19 కోట్ల 38 లక్షల నిధులు మంజూరు

- ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి



సీకే న్యూస్ హుజరాబాద్ ప్రతినిధి


హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం 19 కోట్ల 38 లక్షల 50 వేల నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. శనివారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హుజరాబాద్ నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ నుండి 6 కోట్ల 36 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అంతేకాకుండా వర్షాకాలంలో వరదలతో డ్యామేజ్ అయిన రోడ్ల మరమ్మత్తుల కోసం రెండు కోట్ల 40 లక్షలు, కమలాపూర్ మండలంలో తారు రోడ్డు నిర్మాణం కోసం రోడ్ల భవనాల శాఖకు నాలుగు కోట్లు, హుజురాబాద్ మండలంలో బిటి రెన్యూవల్ కోసం ఆరు కోట్ల 50 లక్షల మంజూరైనట్లు తెలిపారు. గతం సంవత్సర కాలంలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 100 కోట్లను కేటాయించగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. 

నియోజకవర్గంలోని ప్రతి వాడలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించామని తెలిపారు. త్వరలోనే నూతన పాఠశాల కళాశాల భవనాలను కుల సంఘాల భవనాలను ప్రారంభించుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గానికి 120 కోట్ల నిధులను అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరు చేయించానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్లు తోట రాజేంద్రప్రసాద్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments