అర్హులైన అన్ని వర్గాల పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి

అర్హులైన అన్ని వర్గాల పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి..

మాల మహానాడు జిల్లా అధ్యక్షులు.. అల్లాడి పౌల్ రాజ్

CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి



17 డిసెంబర్ 2022 

  స్థానిక భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో జరిగిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా నిర్మాణం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఒకే వర్గానికి కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని గుర్తు చేశారు. 

అదేవిధంగా ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలను గుర్తించి అర్హత కలిగిన అందరినీ గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి అందరికీ సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అల్లాడి జయరాజు,కొంగ సాగర్,యేసు,కనకరాజు,డేగల రాజు,బర్ల రామకృష్ణ,అల్లం ఉదయ్ కాంత్,కుసిని శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Comments