మంత్రి గారు ఇటు వినండి సారు!
ఇప్పటి వరకు మాకు ఇండ్లు ఇండ్ల స్థలాలు రాలేదు!
అధికార పార్టీ కానీ వారి ఇండ్లు ఇండ్ల స్థలాలు స్వాధీనం చేసుకుని క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు పై CPM/CPI నిరసనలు..
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేశ్వావపురం గ్రామంలో సుమారు 20 సంవత్సరాల క్రితం నుండీ జీవనం సాగిస్తున్న నాలుగు నిరుపేద కుటుంబాలకు దురదృష్టవశాత్తూ రోడ్లు విద్యుత్ లేని చీకటి గృహాలు మంజూరు అవడం విశేషం ఇన్ని ఇక్కట్లకు కారణం ఈ గొప్ప పథకoలో మాకు ఇల్లు మంజూరు కావడమే అంటూ రోధిస్తున్న బాధితులు..
ప్రస్తుత తెలంగాణలో అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా లేకున్నా.. పేదలపక్షo నిలిసిన నాయకుడు మరో వర్గానికి అనుకూలం అయినా.. అధికారపార్టీ నాయకులు పలు శాఖల అధికారులపై వత్తిడి తెచ్చి..దాడులు..తప్పుడు కేసులు పెట్టించి.. బెదిరింపులు..వేధింపులు..చేయిoడం..ఈ నాయకులకు ప్రజా ప్రతినిధులకు సరైన పద్ధతి కాదూ..అంటూ ప్రశ్నించిన సి పి ఐ.. సి పి యమ్ వామపక్షాల నాయకులు..
వక్తలు వామపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ నియోజకవర్గoలో ఈ మండలంలో రెండు పడకల ఇండ్లు పొందిన వారి ఇండ్లు.. ఇండ్ల స్థలాలు..ఇలాగే లాక్కుని వేధిస్తున్నారా..ప్రక్కనే అనేక ఆక్రమణ స్థలాలు ఉన్నాయి.. కొందరికి గత వసూల్ దార్లు తప్పుడు పాసుపుస్తలు జారీ చేశారు వారు శుద్ధ పూసలా..
అధికారపార్టీకీ అనుకూల దారులకు ఏ నిబంధనలు వర్తించవా.. అందుకేనా ఈ నిరుపేదల గుడిసెలు కూల్చేది.. వీరి రేకుల షెడ్లు కక్షతో తొలగిస్తే..ఇతర ప్రాంతాల రెండు పడకల లబ్ధిదారుల నివాస స్థలాలు..గృహాలు.. కూడా లాక్కుని..స్వాధీన పర్చుకోవాలి..లేనిచో ధర్మయుద్ధం..నిరసనలు చేయడం తధ్యం అంటూ ఆవేదనలు వ్యక్తం చేసిన వామపక్షాలు నాయకులు బాధిత ప్రజలు స్థానిక గ్రామస్తులు సామాజిక కార్యకర్తలు...
ఈ కార్యక్రమంలో సి పి ఐ నాయకులు, లాల్ మియా, సి పి ఎం నాయకులు రామా లింగేశ్వర రావు, గ్రామ సిపిఎం శాఖా సభ్యులు సురేష్,నరేష్, గ్రామస్తులు, స్థానిక ప్రజలు, బాధిత మహిళలు,సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నాని అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల నాయకుల నిరంకుశ విధానాలు యండగట్టే సమయం అసన్నమైనది అంటూ ఆవేదనలు వ్యక్తం చేశారు..
Comments
Post a Comment