*తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్,*
*సి కె న్యూస్ ప్రతినిధి పాలకవీడు*
గిరిజన శక్తి నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢిల్లీలోని వారి నివాసంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ నాయక్, ఉపాధ్యక్షులు డాక్టర్ భూక్య రాజారాం నాయక్ కలిసి వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని, 335 ఎకరాల భూమిని 2019 లోనె కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి సరిపడ బడ్జెట్ ను కేటాయించి, వీసీని నియమించి, వెంటనే వచ్చే విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీ ప్రారంభించేటట్టు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలని కోరారు.
ఈ విషయాన్ని పార్లమెంటులో చర్చించాలని బిఆర్ఎస్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశామన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఢిల్లీకి వచ్చి కొట్లాడుతున్న గిరిజన శక్తి నాయకుల పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు.
Comments
Post a Comment