*రెవరెండ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కు సామాజిక సేవలో వరల్డ్ గిన్నిస్ ఆఫ్ ది రికార్డ్*
నా సేవ జీవితంలో సామాజిక సేవలో భాగంగా ఎందరో అభాగ్యులు నా దృష్టికి వచ్చినప్పుడు వారి అవసరాన్ని అనేకులతో పంచుకున్నప్పుడు మనసున్న మహారాజులు ముందుకొచ్చి వారికి తోచిన సహాయాన్ని అందించడంతో అట్టి ఆర్ధిక సహాయాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అందిస్తూ గత 28 సంవత్సరాలనుండి అనేకుల కన్నీళ్లు తుడవడం జరిగింది.
అవును కష్టాల్లో ఉండి దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్న వాళ్ళు కోకొల్లలు అదే సమయంలో మంచివాళ్ళు ఇప్పటికి ప్రపంచంలో చాలామంది ఉన్నారని ఉడతాభక్తిగా నేను చేస్తువచ్చిన సామాజిక సేవలో అనేక అనుభవాలు ఋజువు చేశాయి. కానీ నా సేవ జీవితంలో ఎప్పుడుకూడ పేరు కొరకుగాని, మెప్పులకొరకుగాని నేను ఎప్పుడు ప్రకులాడలేదు మరియు ఎదురుచూడలేదు కూడా...
కానీ సామాజిక స్పృహతో మనము ఎదుటివారి కొరకు బాధ్యత తీసుకొని ఏ ఒక్కరి కన్నీరు తుడిచిన, సమాజంలో గుర్తించి, సన్మానించే అనేక సంస్థలు మనల్ని ఎన్నుతట్టి ప్రోత్సహించే వ్యవస్థలు ఉన్నాయని ఈ రోజు *వరల్డ్ గిన్నిస్ ఆఫ్ ది రికార్డ్ గౌరవ ప్రశంస పత్రం* అందుకోవడం ద్వారా నాకు స్పష్టంగా అర్ధమైంది. దీన్ని బట్టి నిజంగా నాలో రోజు రోజుకు సామాజిక సేవలపట్ల బాధ్యత మరియు ఆసక్తి పెరిందని చెప్పుటకు సంతోషిస్తున్నాను.
సమాజంలో నేటి యువత ముందుకొచ్చి అనేకులు వారి కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చేతనైన వరకు మనము వారికి సహాయం చేస్తూ, ఇతరులు కూడా సహకరించేలా కృషి చేస్తే మనకంటూ ఒక మంచిపేరు చిరకాలం ఉండిపోతుంది. సాటి మనిషిపట్ల ప్రేమ, కనికరం, ఆప్యాయత, జాలి చూపినట్లయితే అనేకులను వారి జీవితంపై ఆశను చిగురింపచేసినవారుగా మిగిలిపోతాం మరియు అనేకులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపగలం. మన గ్రామాలు పట్టణాలు మానవత్వంతో నిండిన మంచి వాతావరణం కలుగజేసినవారంగా భవితరాలు తెలుసుకుంటాయి.
ఇటువంటి సామాజిక సేవలు అందించడానికి మనకు కులం, మతం, ప్రాంతం అవసరంలేదు కేవలం *మనిషిని మనిషిలా చూస్తే చాలు.* ఆ ప్రాంతాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయి అని ఈ సందర్బంగా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరోసారి నేను చేస్తువచ్చిన చిన్నచిన్న సేవలను గుర్తించినందుకు *వరల్డ్ గిన్నిస్ ఆఫ్ ది రికార్డ్ మనసుపూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
- *బిషప్ రెవ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్*
Comments
Post a Comment