కేసీఆర్ అడుగేస్తే విజయం తథ్యం: మంత్రి పువ్వాడ అజయ్
కేంద్రంలోని దుర్మార్గ పాలనపై దండెత్తిన ఆయుధం కేసిఆర్: మంత్రి పువ్వాడ
తెలంగాణ సంధించిన సింహబాణం కేసిఆర్: మంత్రి పువ్వాడ
--: సీఎం కేసిఆర్ నాయకత్వంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
___________________________________
జాతీయ రాజకీయాలకు సీఎం కేసిఆర్ మార్గదర్శకుడు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ అడుగేస్తే విజయం తథ్యం అని ఆయన గర్జిస్తే ప్రత్యర్థుల కోటలు బద్దలవుతాయని వ్యూహానికే నడక నేర్పిన వ్యూహకర్త కేసీఆర్ అని మంత్రి పువ్వాడ కొనియాడారు. సీఎం కేసీఆర్ మస్తిష్కంలో ఎన్నో యుద్ధవ్యూహాలు దాగి ఉంటాయి అని ప్రత్యర్థులు ఎన్ని పద్మవ్యూహాలు రచించినా వాటిని ఛేదించే మేధో వ్యూహం ఆయన వద్ద ఉంటుందన్నారు.
తెలంగాణ సంధించిన కేసీఆర్ అనే సింహ బాణం దేశాన్ని పాలిస్తున్న దుర్మార్గ పాలనపై దండెత్తిన ఆయుధం అని దేశానికి మంచి రోజులు తీసుకొచ్చేవరకు ఈ పోరు ఆగదన్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్ ముందుకు దూసుకువస్తున్నారు అని ఆయనతో కలిసి ధర్మ యుద్ధం చేయడానికి అందరూ సిద్ధమవ్వాలి అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు సాధించడం కోసం భారత్ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ ప్రారంభించిన జాతీయ రాజకీయ ప్రస్థానం తెలంగాణ వేదికగానే సంచలన అడుగులు వేస్తున్నది అని మంత్రి పేర్కొన్నారు.
జాతీయ గౌరవాన్ని పెంపొందించే విధంగా రాజకీయ వ్యవస్థను రూపకల్పన చేసిన వ్యక్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటివ్యక్తి అని అలాంటి నాయకుడిని జాతీయస్థాయిలో ఒక సమర్థవంతమైన, విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి దేశం యావత్ ఆహ్వానిస్తున్నది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.
Comments
Post a Comment