అజయ్ బాబుపై జరిగిన దాడిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తుంది

అజయ్ బాబుపై జరిగిన దాడిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తుంది.



 మనిషిని మనిషిలా చూడాలి కాని మతపిచ్చితో ఎదుటివారిపై దాడి చేయడం సరికాదని ఎన్. హెచ్. అర్ సి. హెచ్చరిస్తుంది. యేసుక్రీస్తు సువార్త దళం పాస్టర్ అజయ్ బాబుపై మతోన్మాధులు కత్తితో పొడిచారు, ఒంటినిండా గాయలు. వారి సహోదరుడు భరత్ కి కూడా కత్తిపోట్లు అయ్యాయి. అజయ్ బాబు కార్ ద్వంసం చేశారు.


 వివరాల్లోకి వెళ్ళితే, నిన్న రాత్రి సరిగ్గా 7 గంటల ప్రాంతంలో పాస్టర్ అజయ్ బాబు ఖమ్మం నుండి తన స్వగ్రామమైన సరోజనాపురం వెళ్తున్నప్పుడు, కొణిజర్ల అవతల కొందరు దుండగులు కార్ కి అడ్డం తిరిగి బండరాయితో కార్ ముందు అద్దాన్ని పగలగొట్టారు. మంకీ క్యాపులు పెట్టుకున్న ముగ్గురు దుండగులు, మతోన్మాధులు పాస్టర్ అజయ్ బాబును నరికారు.. మేడమీద గుండె ప్రక్కన తీవ్ర గాయా లయ్యాయి. దుండగులను అడ్డుకున్న అజయ్ బాబు సహోదరుడు భరత్ చేతులకు గాయాలయ్యాయి.


అత్యవసరంలో హాస్పిటల్ కి తరలించి చికిత్సనంతరం ఇంటికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఇటువంటి మతపిచ్చిపట్టిన వాళ్ళను కుకేటివేళ్లతో తీసివేయాలి. ఎందుకంటే ఇది సమాజానికి చాలా ప్రమాదకరం...!

. ఈ విషయంలో వెంటనే ఖమ్మం సీపీ పట్టించుకోని దోషులను పట్టుకోవాలి, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకొని ఇటువంటి మతోన్మాధులకు తగిన బుద్ధి చెప్పాలని మానవ హక్కుల సంక్షేమ మండలి సౌత్ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

Comments