అంతర్ జిల్లా దొంగ ను అరెస్ట్ చేసిన భద్రాచలం పోలీసులు

అంతర్ జిల్లా దొంగ ను  అరెస్ట్ చేసిన భద్రాచలం పోలీసులు


15 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి పూజా పాత్రలు మరియు 2 లక్షల 30 వేల నగదు రికవరీ



CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి


17 డిసెంబర్ 2022 


భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, భద్రాచలం పట్టణంలో అంతర్ జిల్లా దొంగలు ప్రవేశించి ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారని పక్కా సమాచారంతో భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భూపాలపల్లి పట్టణానికి చెందిన అంతర జిల్లా దొంగ దురిశెట్టి స్వామి నిరంజన్ ను భద్రాచలం పోలీస్ లు సీసీ కెమెరాల సహాయంతో చాకచక్యంగా పట్టుకొని తనదైన శైలి లో విచారించగా, భద్రాచలం పట్టణంలో చేసిన పలు దొంగతనాలు ఒప్పుకున్నాడు.

 గతంలో  ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలోని దొంగతనాల కేసు లలో  అరెస్టు కాబడి జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ పై విడుదలైనాడు, అయినను అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. 

నాలుగు జిల్లాల పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్న దొంగను చాకచక్యంగా అరెస్టు చేసిన భద్రాచలం పోలీసులను ఏఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ క్యాష్ రివార్డ్ లతో అభినందించారు . ఇట్టి కార్యక్రమంలో భద్రాచలం టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి ఎస్ఐలు శ్రీకాంత్ మధు ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు..

Comments