మీడియా మిత్రులకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు

మీడియా మిత్రులకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు.



ఈ రోజు ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక *తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ లో విద్యార్థులకు జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ తరుపున స్థానిక ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ సహకారంతో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం గురించి అవగాహన సదస్సు జరిగింది.


ఈ సందర్బంగా *జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ సౌత్ జోన్ ప్రెసిడెంట్ పీటర్ నాయక్ లకావత్* మాట్లాడుతూ, విద్యార్థులు మంచిగా చదువుకోవాలి మరియు మనిషిగా మనకున్న హక్కులను తెలుసుకొని దేశం గర్వించేలా ఉన్నతస్థాయిలో ఎదిగి తల్లిదండ్రులను మరియు విద్యానందిస్తున్న గురువులపట్ల గౌరవ మర్యాదలు కలిగి సమాజంలో సాటి మనిషి పట్ల ప్రేమ ఆప్యాయత నైతిక విలువతో ముందుకు దూసుకుపోవాలని ఆశిస్తూ, ఉన్నతస్థాయిలో ఎదగాలని ఆకాంక్షంచారు.


ఈ సందర్బంగా అన్ని విధాలా సహకరించిన స్థానిక ప్రిన్సిపాల్ ఎ. రాజేంద్ర ప్రసాద్, 

వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్. హరి రాం జె. అర్. వి.పి. నార్మధ, మరియు స్టాఫ్ద వంశీ, కృష్ణ, నరేష్, శివలాల్ మరియు రమణ గోండ్ అనువారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, హాస్టల్ పిల్లలపట్ల వారు చేస్తున్న మంచి సేవలకై వారిని అభినందించారు.

తర్వాత స్థానిక ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ కలిసి జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ సౌత్ జోన్ ప్రెసిడెంట్ మరియి వారి బృందం ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ సంజీవ్ మరియు టీం మెంబెర్ కరుణాకర్ ను శాలువలతో సన్మానించారు.

ఇట్లు


పీటర్ నాయక్ లకావత్,

జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ సౌత్ జోన్ ప్రెసిడెంట్.

Comments