వారసత్వ భూమి ఆక్రమణకు కుట్ర

 వారసత్వ భూమి ఆక్రమణకు కుట్ర

-- 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై కన్ను

-- అధికారులే నాకు న్యాయం చేయాలి

-- విలేకరుల సమావేశంలో బాధితరైతు కొప్పుల రామారావు



ఖమ్మం, డిసెంబర్ 19 : తండ్రి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వాటా భూమిని 40 సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి భూమిని మా అన్నయ్యలు తమకొచ్చిన వాటా భూమిని అమ్ముకొని నా భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు కుట్ర చేస్తున్నారని బాధిత రైతు కొప్పుల రామారావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామ సర్వే నెంబర్ 843, 844లలో ఆరు ఎకరాలు వారసత్వ భూమి కాగా ఒక ఎకరం కొనుగోలు చేసి మొత్తం 7 ఎకరాలను గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నానని కొప్పుల రామారావు తెలిపారు. తన తండ్రి కొప్పుల పుల్లయ్యకు 5గురు కొడుకులమని, తాను చిన్నవాడినని తనకు వారసత్వంగా వచ్చిన 6 ఎకరాలు, కొనుగోలు చేసిన మరో ఎకరం మొత్తం 7 ఎకరాలు 40 సంవత్సరాలుగా కష్టపడి సాగు చేసుకుంటున్నానన్నారు. కాలక్రమేన సర్వే నెంబర్లలో మార్పు చేర్పులు జరిగాయని అయినప్పటికీ భూమి సాగులో నేనే ఉన్నానన్నారు. మా అన్నయ్యలు అట్టి భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు కుట్ర చేస్తున్నారని, అవసరమైతే బంధుత్వాన్ని వదిలి దాడులు చేసేందుకు కూడా వెనకడం లేదని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశాడు. 2008లో అదే భూమికి సంబంధించి అక్రమార్గంలో డాక్యుమెంట్స్ సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని అట్టి రిజిస్ట్రేషన్ ను అధికారులు గుర్తించి కొప్పుల నాగేశ్వరావును మందలించి అట్టి రిజిస్ట్రేషన్ రద్దు చేశారని తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి కష్టపడి సాగు చేసుకుంటున్న భూమిని తన కప్పగించి న్యాయం చేయాలని బాధిత రైతు కొప్పుల రామారావు వేడుకుంటున్నాడు.

Comments