*ది.13.12.2022.*
ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న రోజు వారి కూలీలకు వెంటనే జీతాలు చెల్లించాలి.
మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాసిన మద్దిశెట్టి.
*BSSM అధ్వర్యంలో ఇచ్చిన పిటిషన్ కి స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యూ ఢిల్లీ.*
*NHRC Case No.2596/36/13/2022.*
*తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న రోజు వారి కూలీలకి 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, జీతాలను అడిగితే కొత్తవారిని నియమిస్తున్నారు అని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు రోజు వారి కూలీల అసోసియేషన్ భారతీయ సర్వ సమాజ్ మహా సంఘ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు ని ఆశ్రయించడం జరిగింది.*
*మద్దిశెట్టి సామేలు ఈ విషయం మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ లో గత 40 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న రోజు వారి కూలీలను రెగ్యులర్ చేస్తూ, 10 నెలల జీతాలు చెల్లించాలని, వేతనాలు నెలలో మొదటి వారం లోపులో అకౌంట్ లలో వేయాలని, 30%PRC కల్పించాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది.
స్పందించిన కమిషన్ తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కి మరియు సెక్రెటరీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.*
Comments
Post a Comment