నిమ్స్ లో మెరుగైన సదుపాయాలు లేక ప్రజలనుండి నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ కి అందుతున్న ఫిర్యాదులు...
తెలంగాణ రాష్ట్రములో అత్యంత మెరుగైన వైద్యం ప్రజలకు అందిస్తున్నామని గడిచిన 8 సంవత్సరాలనుండి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు కార్యాచరణలో లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు 2వ అంతస్తులో, CT స్కానింగ్ అపాయింట్‌మెంట్ మరియు నివేదికల కోసం రోగులకు సమాచారం ఇవ్వడానికి కనీస 3 గంటల సమయం తీసుకుంటున్నారు మరియు స్కానింగ్ నివేదికను నిర్వహించడానికి నిమ్స్ అధికారులు 24 గంటల సమయం తీసుకుంటున్నారు. ఇలా ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేరుకున్నారు. ఈ నేపథ్యంలో 8 ఏళ్లలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోగి పరిస్థితి ఎలా ఉంది మరియు ఆరోగ్య శాఖ మెరుగుదల ఎంతవరకు అభివృద్ధి చేశారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తగిన వైద్యం అందించి సమయానికి రోగులను కాపాడాలని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ కి అందిన ఫిర్యాదుతో వైద్యుల నిర్లక్ష్యంపై స్పందించి చర్యలు తీసుకోవాలని నేషనల్ డైరెక్టర్ అఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీఈఓ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ కోపరేటింగ్ చీఫ్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు, నేషనల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ జాన్ కాంతారావు, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ప్రభుత్వాన్ని కోరారు.
మన రాష్ట్ర మంత్రులు 8 సంవత్సరాల మెరుగైన సేవా నినాదం తర్వాత తెలంగాణ ఆరోగ్య శాఖ పని చేస్తోంది. అయితే ఈ పని విధానంలో రోగులు క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు మరియు తీవ్రమైన పరిస్థితులకు గురవుతున్నారు. ఆరోగ్య, వైద్య శాఖ పనితీరును మెరుగుపరచాలని, ప్రజలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ హైదరాబాద్ హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న రవీందర్‌రెడ్డి నుంచి ఫిర్యాదు అందింది. వైద్యుల పనితీరు మరియు వారికి కావాల్సిన మెరుగైన పరికరాలు సమకూర్చి నిమ్స్ లో ఉన్న కొరతలు వెంటనే తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించారు.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి సమాజంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యపై NNHRF పోరాడుతుందని డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ పత్రిక ప్రకటనలో పేరుకున్నారు.
ఎన్.ఎన్.హెచ్.ఆర్.ఎఫ్‌కు ప్రజల ఆరోగ్యం మరియు వైద్యం ముఖ్యం, ప్రభుత్వం దీనిని మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు...
Comments
Post a Comment