జనవరి 23వ తారీఖున కేంద్ర సహాయ మంత్రి డిఎల్ వర్మ పర్యటన

జనవరి 23వ తారీఖున కేంద్ర సహాయ మంత్రి డిఎల్ వర్మ పర్యటన

CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి

జనవరి 20:



శుక్రవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి  నివాసము నందు భద్రాచలం మండలం శక్తి కేంద్ర ఇంఛార్జిలు, మండల కమిటీ సభ్యులతో సమావేశం జరిగినది.


ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాస్, మహబూబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముసుగు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసాచారి పాల్గొనడం జరిగినది. 


వారు మాట్లాడుతూ జనవరి 23వ తారీఖున కేంద్ర సహాయ మంత్రి డిఎల్ వర్మ  భద్రాచలం విచ్చేయనున్నారు. 

ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దర్శనం, 9 గంటలకు ప్రెస్ మీట్, 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర విలాస్ లో శక్తి కేంద్ర ఇన్చార్జిలతో, సీనియర్ నాయకులతో సమావేశం కలదు. 


కావునా తప్పనిసరిగా సకాలంలో అందరూ హాజరు కాగలరని తెలియపరిచినారు. 

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి చెలుబోయిన వెంకన్న, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి  పి సి కేశవ, సీనియర్ నాయకులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు *పేరం ఉపేందర్*, దళిత మోర్చా మండల అధ్యక్షులు వి క్రాంతి బాబు, బీజేవైఎం మండల అధ్యక్షులు అన్నం హరీష్, ఏబీవీపీ నగర కార్యదర్శి అన్నం సాయి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, సూరత్ సుదర్శన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గొర్రుముచ్చు జయరాజు, మండల కార్యదర్శి గోపి, శక్తి కేంద్రాల ఇన్చార్జీలు పాల్గొనడం జరిగింది.

Comments