ఈ నెల 26 తేదీన గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయండి...

 *ఈ నెల 26 తేదీన గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయండి...*

సూరంసెట్టి కిషోర్



పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధిర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్కఆదేశాలతో మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం సెట్టి కిశోర్ అధ్యక్షతన మధిర మండల గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ....


ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ కేసీఆర్‌ చేతిలో బందీ అయ్యిందని, ప్రధాని మోదీకి దేశభద్రత పట్టదని, ప్రభుత్వాలను కూల్చడమే పరమావధి అయిందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని దోచుకోవడం పూర్తయిందని భావిస్తున్న కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయస్థాయిలో దోపిడీకి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న *‘హాథ్‌ సే హాథ్‌ జోడో’* యాత్రలో ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, కేసీఆర్‌ల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు...*హాథ్‌ సే హాథ్‌ జోడో’* (చెయ్యి చెయ్యి కలుపుదాం) పాదయాత్ర ప్రారంభ రోజున నెల ఈ 26వ తేదీన గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు సూచించారు...


హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్ర కు సంబంధించిన ముఖ్య విషయాలు

- హత్ సే హాత్ జోడో యాత్ర జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభమవుతుంది.

- ఈ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి రెండు నెలల పాటు కొనసాగుతుంది. 

- హత్ సే హత్ జోడో కార్యక్రమం కింద రాహుల్ గాంధీ లేఖతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతారు.

-  ఈ ప్రచారంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ప్రతి ఇంటికి పంపిణీ చేస్తారు. 

-  రాష్ట్రంలోని దాదాపు 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, ఆరు లక్షల గ్రామాలు, 10 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కవర్ చేస్తారు.


ఈ సమావేశంలో సర్పంచ్ లు *పులి బండ్ల చిట్టిబాబు, మదార్ సాహెబ్,గొర్రెముచ్చు ప్రకాశమ్మ* ఎంపీటీసీ *చిలకబత్తిని రాజు* మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి*   సొసైటీ డైరెక్టర్ *పత్తేపరపు సంగయ్య* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ *షేక్ జహంగీర్* మధిర మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* మండల బీసీ సెల్ అధ్యక్షుడు *చిలువేరు బుచ్చి రామయ్య* మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్* మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు *బాణావత్ వెంకటరమణ నాయక్* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు* కాంగ్రెస్ నాయకులు *ఐలూరి సత్యనారాయణ రెడ్డి, సూర్యదేవర కోటేశ్వరరావు, పగిడిపల్లి డేవిడ్, షేక్ కరీముల్లా, షేక్ జాకీర్ పుట్టా పుల్లారావు మోదుగు బాబు ఆదిమూలం శ్రీనివాసరావు మైలవరపు చక్రి మరియు మధిర మండల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు

Comments