31/1/2023 మంగళవారం
*ఏ సి డి పేరుతో విద్యుత్ వినియోగదారులపై వేసే అదనపు చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
కొత్తగూడెం డివిజనల్ ఆపీసు DE కార్యాలయం ముందు దర్నా*
సి కె న్యూస్ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపై ఎ సి డి( అడ్వాన్స్డ్ కంజంప్షన్ డిపాజిట్) పేరుతో వేస్తున్న అదనపు భారాన్ని ఏత్తివెయాలని డిమాండ్ చెస్తూసి.పి.ఐ (ఎంఎల్) ప్రజా పంథా రాష్ట కమిటి పిలుపు మేరకు ఈ రొజు కొత్తగూడెం DE కార్యలయంముందు దర్నా నిర్వహించి వినతిపత్రము ఇవ్వటంజరిగింది.
అనంతరం పార్టిజీల్లా నాయకులుజాటోత్ క్రిష్ణ మాట్లాడుతుాACD పెరుతో అదనపు చార్జీల విధానాన్ని ఉపసంహరించుకోవాలని దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు మరింత కష్టాల్లోకి కూరుకుపోయి విద్యుత్ వినియోగానికి దూరమవుతారని స్పష్టం చేస్తున్నాంఅనారు. సంక్షేమం పేరు చెప్పి ప్రగల్బాలు పలికే టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్వాన్స్ పేరుతో వసూళ్లకు పూనుకోవడం దుర్మార్గమైన ప్రక్రియగా భావిస్తున్నాం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తును పూర్తిస్థాయిలో అందిస్తున్నామనీ, కోత అనేది లేకుండా చేశామని చెప్పుకుంటున్నది. అన్ని స్థాయిలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్నది.
27 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు కూడా 24 గంటల కరెంటును ఇస్తున్నామని చెబుతున్నది. దేశంలోనే అత్యుత్తమంగా అందిస్తున్నామని ప్రగల్బాలు పలికి ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు కోతలు ప్రారంభించిందని. డెవలప్మెంట్ చార్జీల పేరుతో విపరీత అదనపు భారాలను మోపింది.
అయినా విద్యుత్ సంస్థ నాలుగేళ్లుగా 33 వేల కోట్ల రూపాయల బాకీతో ఉన్నది. వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వం నేటికీ విద్యుత్ సంస్థకు ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. దాంతో విద్యుత్ సంస్థ 33 వేల కోట్ల బాకీ లో కూరుకుపోయిందఅనారు.
ఈ బాకీలను కేసీఆర్ ప్రభుత్వం సర్దాల్సింది పోయి ఈరోజు ప్రజలపై భారాలు వేయడానికి పూనుకొవటందుర్మర్గమ్తెన చర్యఅనారు. గత సంవత్సరం 500 యూనిట్ల పైన, తర్వాత 3 యూనిట్ల పైన విద్యుత్తును ఉపయోగించే వారిపై ఏ సి డి చార్జీలను వేసింది మోపింది,
ఈ సంవత్సరం 300 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వినియోగదారులపై ఏసీడీ చార్జీలను మోపుతున్నది. ఉన్న ఛార్జీ పై రెండు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నది. అంటే పేద, మధ్యతరగతి వర్గాలపై పూర్తి భారాన్ని వేయటమేఅనారు.ఇవి అదనపు బిల్లులు కావని, కేవలం అడ్వాన్స్ అని బుకాయిస్తున్నది. ప్రభుత్వ నష్టాలు అన్నిటిని ప్రజలపై మోపడానికి కుట్ర పన్నుతున్నది.
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్వతంత్రంగా ఆలోచించకుండా ప్రభుత్వ విధానాలకి వత్తాసు పలుకుతున్నది. ఈ విధానాన్ని సి.పి.ఐ ఎంఎల్ ప్రజాపంధా రాష్ట్ర కమిటీ ఖండిస్తుందని అనారు.వెంటనె ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూనామనిఅనారు.
ఈకార్యక్రమానికి పట్టణ కార్యదర్శి పి.సతీష్ అద్యక్షత వహించారు.పార్టి జిల్లా నాయకులు అజాద్ ,బానోత్ దర్మ,పట్టణ నాయకులు క్రిష్ణ,రాజశేఖర్ ,కె.జోతి,సంతోష్ .తదితరులు పాల్గొనారు.
ఇట్లు
Comments
Post a Comment