*భారత్ జోడోయాత్ర పూర్తయిన సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టిపిసిసి సభ్యులు రాంమ్మూర్తి నాయక్.*
ది 30-01-2023
సింగరేణి కారేపల్లి
Ck న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి కారేపల్లి మండల కేంద్రం నందు ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన *టిపిసిసి సభ్యులు వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ గారు.* మరియు మండల కాంగ్రెస్ నాయకులు.
అనంతరం భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా ఈరోజు ముగిసిన సందర్భంగా పి.సి.సి. మరియు డి.సి.సి. ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలారి చంద్ర ప్రకాష్ గారి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయిలు పంచిన రాంమ్మూర్తి నాయక్ గారు.
ఈ సందర్భంగా రాంమ్మూర్తి నాయక్ గారు మాట్లాడుతూ —
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ గారు చరిత్రలో లిఖించబడతారని. ఆది శంకరుడే మరల రాహుల్ గాంధీ గా పుట్టారని. మహాత్మా గాంధీ తర్వాత అహింస మార్గంలో నడిచింది రాహుల్ గాంధీ గారేనని. రాహుల్ గాంధీ గారు సంధించిన మొదటి అస్త్రం గురి తప్పలేదని. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని గా భారతదేశాన్ని పరిపాలించి రామరాజ్యాన్ని మరలా తీసుకొస్తారని.ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని ఐక్యమత్యంతో పార్టీ కోసం పనిచేయాలని. అప్పుడే రాహుల్ గాంధీ గారి ఆశయం నెరవేరుతుందని రాంమ్మూర్తి నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు వాంకుడోత్ గోపాల్ నాయక్, మాజీ ఎంపిటిసి గడ్డం వెంకటేశ్వర్లు, పులసం బద్రం, ఈసాల వెంకటేశ్వర్లు, ఈసాల ఛాయాదేవి,తడవాయి రాములు,గమిడి నరసింహారావు,భూక్యతారచంద్ నాయక్,గుగులోతు బద్రు నాయక్, పిల్లలమర్రి లక్ష్మణ్, తేజావత్ కిష్ట, పిల్లలమర్రి కార్తీక్ , పిల్లల మర్రి కోటేష్ ,వాంకుడు రవి ,వాంకుడోత్ సురేష్, ఆవులు వెంకటేశ్వర్లు, తేజవత్ బాబురావు, గూగులోత్ బిక్కులాల్,గుగులోత్ దాస్య,లాకవత్ రాజేష్, హనుమ, పాయం లక్ష్మయ్య, భానోత్ బాసు, తాటి నాగేశ్వరరావు, గుగులోత్ బాలకృష్ణ, భూక్య బాలు, అజ్మీర నారాయణ,గోవర్ధన్, తోటకూరి రాంబాబు, వెంకటలక్ష్మి, కోటి, పార్వతి, వార్డ్ మెంబర్ ఇస్లావత్ ఉమా, రాజేష్, కమల, రాములు, దరావత్ కిషన్, వాంకుడోత్ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment