మహనీయుల చిత్రాలతో క్యాలెండర్ తీయడం అభినందనీయం

 *మహనీయుల జీవిత చరితలు నేటి విద్యార్థి, యువకులు  తెలుసుకోవాలి*÷ *కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత*....



 *నేటి యువత  సమాజ సేవ కోసం ముందుకు రావాలి* ÷ *మహిళా ప్రాంగణం అధికారి  వేల్పుల విజేత*...


 *సమస్యల పరిష్కారం కోసం యువత ఉద్యమించాలి* ÷ *కార్పొరేటర్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు*.....


 *మహనీయుల చిత్రాలతో క్యాలెండర్ తీయడం అభినందనీయం* ÷ *రైతు సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు నున్న నాగేశ్వరరావు*...


*డివైఎఫ్ఐ 2023 జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ సభలో వక్తలు*......

సి కే న్యూస్ ప్రతినిధి 

 ఖమ్మం, జనవరి 19,2023...

  

         మహనీయుల జీవిత చరితలు నేటి యువతకు తెలిసే విధంగా  వారి చిత్ర పటాలతో క్యాలెండర్ తీయడం  అభినందనీయమని , మహనీయుల జీవిత చరిత్ర నేటి యువత తెలుసుకోవాలని  డివైఎఫ్ఐ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ సభలో మహిళా ప్రాంగణం జిల్లా అధికారి వేల్పుల విజేత, 58 వ  కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, రాష్ట్ర నాయకులు నున్న నాగేశ్వరరావు,49వ కార్పొరేటర్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు  పిలుపునిచ్చారు...

         

          *స్థానిక మంచికంటి ఫంక్షన్ హాల్ లో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన  డివైఎఫ్ఐ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ సభలో  పాల్గొని వారు ప్రసంగించారు.* 

              ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో యువత ముందుండాలని, అట్లాంటి సేవలో డివైఎఫ్ఐ ముందుంటుందని  వారు అన్నారు. యువత పెడదాం వైపు వెళ్లకుండా  సమాజంలో అందరూ బాధ్యత తీసుకోవాలని , అట్లా తీసుకున్నప్పుడే సమాజం ముందుకు వెళుతుందని, అత్యంత యువ సంపద గల భారతదేశ ముందుకు పోవాలంటే  యువత సక్రమమైన మార్గంలో ఉండాలని వారు అన్నారు.

      ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ప్రముఖ వైద్యులు అనుదీపు,దూదేకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ బాషా, రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్, టైనీ థాట్స్  స్కూల్ చైర్మన్  భాస్కర్, చక్రి స్కూల్ చైర్మన్ చక్రధర్, బి వి కే జనరల్ మేనేజర్ వై శ్రీనివాసరావు, కార్పొరేటర్ బుర్రి వెంకట్ కుమార్, కైట్స్ అకాడమీ చైర్మన్ తిరుపతి, చంద్రశేఖర్,తార హాస్పిటల్స్  పురుషోత్తమ రెడ్డి,స్వామి, స్వచ్ఛ టీవీ గోపాలకృష్ణ, షేక్ అఫ్జల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు

         ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిషేక్. బషీరుద్దీన్ మాట్లాడుతూ ఉద్యమాల్లో ముందుంటున్న డివైఎఫ్ఐకి  క్యాలెండర్ యాడ్స్ ఇచ్చి సహకరిస్తున్న  వారందరికీ కూడా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు చేసి  యువతను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

         ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో  డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిలు చింతల రమేష్, శీలం వీరబాబు, కనపర్తి గిరి, గుమ్మ మూతరావు,  జిల్లా ఉపాధ్యక్షులు భూక్య ఉపేందర్ నాయక్, పఠాన్ రోషిని ఖాన్, సత్తెనపల్లి నరేష్,కూరపాటి శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, పొన్నం మురళి,జక్కంపూడి కృష్ణ,భయ్యా బాలాజీ,శభాష్ రెడ్డి,సునీల్, రావులపాటి నాగరాజు,తరంగి పాపారావు, ఎర్ర సాయి, శ్రీను, రెహమాన్, షైక్ షరీఫ్, అల్లుడు దుర్గ, బింగి రమేష్, భాస్కర్,  వర్షిత్ తదితరులు పాల్గొన్నారు......

              ఇట్లు

 డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ...

Comments