భద్రత లో తండ్రి ఆసుపత్రిలో తనయుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

*దేశ భద్రత కొరకు పోరాడే బాలాజీ కుమారుడు దాతల కొరకు ఎదురుచూపులు*.



వివరాల్లోకి వెళ్ళితే నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ పక్షాన ప్రసాద్ఒ అనే ఒక జవాను నుండి అందిన సమాచారం మేరకు ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ పత్రిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ రోజు ఉదయం సి. ఐ. ఎస్. ఎఫ్. జవాను గా పనిచేస్తున్న బాలాజీ కుమారుని ప్రమాదకరమైన నిశ్శహయ స్థితిని వివరిస్తూ, తోటి సిబ్బంది ప్రసాద్ అనే జవాను అందించిన సమాచారం మేరకు వారు  మాట్లాడుతూ ఈవిదంగా స్పందించారు. పరామిలిటరీ సి.ఐ.ఎస్.ఎఫ్. (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) లో దేశం బధ్రత కొరకు పోరాడుతున్న జవాన్ ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, కోఖ్యతండా వాస్తవ్యులు బాలాజీ తన *కుమారుడు 13 సంవత్సరాల బాలునికి డెంగీ, కామెర్లు శోకడంతో కాలేయంలో ఇన్స్ఫక్షన్ వలన ఆరోగ్యం క్షిణించింది*. 


ఈ నేపథ్యంలో హుటాహుటిన దగ్గరలో ఒక ప్రైవేట్ హాస్పటల్ చేరిపించారు. రోజుకు లక్షకుపైనే వైధ్య ఖర్చులు రావడంతో సామాన్య కుటుంబానికి చెందిన బాలాజీ స్థోమతకు మించిన ఖర్చులు భరించలేక, అటు కుమారుని పరిస్థితిని చూసి తట్టుకోలేక కుమిలిపోతున్నాట్లు ప్రసాద్ వివరించారని డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ పేరుకున్నారు. దయచేసి మన జవాన్ కోఖ్యతండా బాలాజీ కుమారుణ్ణి మానవత దృక్పధంతో  ఆదుకోవాలని పత్రిక ప్రకటన ద్వారా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ విజ్ఞప్తి చేశారు.


జవాన్ ప్రసాద్ వారి దృష్టికి తీసుకొచ్చి పరిస్థితి వివరంచడంతో చలించిపోయిన డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ వెంటనే తక్షణమే సహాయంగా వారి వంతుగా మూడు వేల రూపాయలు పంపిస్తూ సాధ్యమైనంత వరకు కొందరు దాతలు ముందుకువచ్చేలా ప్రయత్నం చేస్తాను ధైర్యంగా ఉండమని వారికి నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ పక్షాన నేషనల్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ఫోన్లో మాట్లాడి వారికి భరోసా కలిగించడం జరిగింది.


దాతలు మానవియకోణం నుండి అలోచించి ఈ చిన్నారి ప్రాణం కాపాడాలని కష్టాల్లో ఉన్నా జవాన్ బాలాజీ కుటుంబాన్ని ఆదుకోవాలని  స్థానికి పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గొప్ప మానవతా వాది కచ్చితంగా వారు స్పందిస్తారని ఆశభావం వ్యక్తపరిచారు. అయితే మన ఎమ్మెల్యే గారితోపాటు దాతలు కూడా కులమతాలకు అతీతంగా మీ బిడ్డగా భావించి చిన్నారి పసిబాలుని ప్రాణం కాపాడాలని ప్రజలకు  పులిపునిచ్చారు.. 


ఈ క్రమములో  తోటి సిబ్బంది ప్రసాద్ వారి స్టాఫ్ కు మానవత్వంతో ముందుకు రావాలని విన్నవించిన కారణంగా సిబ్బంది స్పందించి వారికి తోచినకొద్ది సహాయం చేయడంతో ఇప్పటికి ఒక లక్ష రూపాయలు జామచేసినట్లు జవాన్ ప్రసాద్ చెప్పారని డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ప్రకటనలో పేరుకున్నారు. కానీ ఇంకా జవాన్ బాలాజీ కుమారునికి పూర్తిగా వైధ్యం అంది కోలుకోవడానికి చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి మానవతావదులు ముందుకొచ్చి వారి కుమారుణ్ణి ఆదుకోవాలని దాతల కొరకు ఎదురుచూస్తున్నారని వారు చెప్పారు.


"మన దేశం కొరకు పోరాడుతున్న జవాన్లకు కూడా ఇంత దినమైన స్థితి ఏంటి?" ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు అలోచించి జవాన్లపట్ల శ్రేద్దవహించవలసిన బాధ్యత కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని ఎన్. ఎన్. హెచ్. ఆర్. ఎఫ్ అధికార ప్రతినిధి డాక్టర్ పీటర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు."

Comments