జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి

 *జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి*: 



(జడ్జి డి.ధీరజ్ కుమార్)


ఫిబ్రవరి 11న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ డి.ధీరజ్ కుమార్ కోరారు బుధవారం మధిర కోర్టు హాల్ లో మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జడ్జి కోర్టుల పరిధిలోని పోలీస్ స్టేషన్ లు, ఎక్సైజ్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లతో సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీకి అనుకూలంగా ఉండే కేసులకు సంబంధించి కక్షిదారుల మధ్య రాజి వాతావరణాన్ని కుదుర్చి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటిలాగే జాతీయ స్థాయిలో నిర్వహించే మెగా లోక్ అదాలత్ కు సంబంధించి మధిర కోర్టుల పరిధిలో కేసుల పరిష్కారంలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. రాజీ తో కేసుల పరిష్కారానికి నిర్వహించనున్న ఈ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు నాగలక్ష్మి, భద్రయ్య, కోర్టు సూపర్డెంట్ సత్యనారాయణ, బెంచ్ క్లర్క్ హనీషా, దివి, నాతో పాటు కోర్టు సిబ్బంది కోర్టు కానిస్టేబుళ్లు ఉన్నారు.

Comments