*వాకౌట్ రాజకీయం..*
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని వ్యూహం..
బీఆర్‌ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సీ కె న్యూస్ హైదరాబాద్ :
ముఖ్యమంత్రి కేసీఆర్ వాకౌట్ రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఆయన వ్యూహాల్లో రాజకీయ చతురత లోపించి కేవలం ఉనికిని చాటుకోవలనే ఆరాటమే కనిపిస్తోంది.
పబ్లిక్ మీటింగ్ అయినా.. పార్టీ మీటింగ్ అయినా.. ఆఖరికి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం లోనూ తన మార్క్ చూపించడం లేదు.
నేడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షురూ కాబోతున్న నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీ దాదాపు నాలుగు గంటల పాటు సాగింది.
అయితే ఎంపీలకు వాకౌట్ పోరాటాలు చేయాలని సూచించడం గమనార్హం.
టీఆర్ఎస్ పార్టీ జాతీయపార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవి. ఈ నేపథ్యంలో కేంద్రంపై పోరాటంలో తమదైన మార్క్ చూపించాలి. ఇతర పార్టీలను కలుపుకుని వాటికి నాయకత్వం వహించాలి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహష్కరించమని.. దేశంలో గవర్నర్ వ్యవస్థపై ఎండగంటాలని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు, ప్రాజెక్టులు, ఆర్థిక పరమైన అంశాలపై పోరాటం చేయడంతో పాటు, జాతీయ అంశాలపై కూడా స్పష్టమైన వైఖరితో వ్యవహరించాలని సూచించారు. అయితే ఆ స్పష్టమైన వైఖరి ఏంటో మాత్రం చెప్పలేదు. కేసీఆర్ ఇచ్చిన అమూల్యమైన సూచనలు బట్టి చూస్తే.. పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంతో పాటు.. ఢిల్లీ వేదికగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీరుకు నిరసన తెలియజేసేలా ఉన్నారు.
తమిళిసై పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. అంతే తప్ప.. రాష్ట్రానికి, దేశానికి పనికొచ్చే పోరాటం బీఆర్ఎస్ ఎజెండాలో ఇప్పటి వరకైతే లేదని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.
Comments
Post a Comment