బిజేపి ని కట్టడి చేయడం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం..
- ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క
బి ఆర్ ఎస్ జాతీయ సభ ఖమ్మం లో నిర్వహించిన నేపథ్యంలో
సిఎల్పి నేత భట్టి విక్రమార్క గురువారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
ఖమ్మం జిల్లా రాజకీయంగా చాలా చైతన్య వంతమైన జిల్లా అన్నారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర ముఖ్య మంత్రులతో నిన్న జరిగిన సభ వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒరిగింది ఏమి లేదన్నారు.
సంస్కృతిని పూర్తిగా కూల్చి వేస్తున్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చెప్పిన విషయాలు ఏమీ పెద్దగా కనిపించలేదన్నారు.
దేశానికి ఉపయోగపడే అంశాలు రాష్ట్రానికి కలిసొచ్చే అంశాలు కూడా లేవని,
పోడు భూముల సమస్యకు ఇక్కడి నుండే పరిష్కారం చెప్తారేమో అనుకున్నాము అది కూడా జరగలేదన్నారు.
ఖమ్మం జిల్లాకు ఒక యూనివర్సిటీ ని అడిగామని అదికూడా ప్రకటించలేదన్నారు.
మీరు పార్టీ పెట్టిన దగ్గరనుండి చెపుతున్న డబుల్ బెడ్ రూమ్ ల గురించి ఏమి చెప్పలేదు
బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి గానీ సింగరేణి మీద కానీ ఎలాంటి స్పష్టత లేదని విమర్శించారు.
భారతీయ జనతా పార్టీని కట్టడి చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ నెల 30 న శ్రీనగర్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభ ఉంటుందని తెలిపారు.
ఆజ్ తో ఆజ్ కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుండి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమమాల గురించి చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు.
వామపక్ష పార్టీలు కూడా బిజెపి ని ఎదుర్కోవాలంటే అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందన్నారు.
Comments
Post a Comment