సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తాతా మధు

 సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు



-  ఎమ్మెల్సీ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు 


సి కె న్యూస్ ఖమ్మం 

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానికం..


సభ నిర్వహణ బాధ్యతలు నిర్వహించి అడుగడుగున పర్యవేక్షిస్తూ అన్నీ తానై జిల్లా నాయకులను ముందుకు నడిపించిన రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి  ఎంపీ నామ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు పార్థసారథి  వద్దిరాజు రవిచంద్ర  జిల్లా పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్సీ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. గురువారం బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 

నాడు స్వయం రాష్ట్ర సాధనకై ఉద్యమంలో నేడు సంక్లిష్టంలో పడ్డ దేశ రక్షణకై అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు తెలియజేస్తూ  స్వచ్ఛందంగా తరలివచ్చి బాసటగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానికానికి జిల్లా పార్టీ తరఫున  కృతజ్ఞతలు తెలిపారు.


పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి తమ నియోజకవర్గ ప్రజలను వారితోనే కలిసి కదిలి వచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు , సండ్ర వెంకట వీరయ్య , వనమా వెంకటేశ్వర్లు కి, శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి కి, శ్రీ మెచ్చ నాగేశ్వరరావు కి, రాములు నాయక్ కి, హరిప్రియ నాయక్ కి, జడ్పీ చైర్మన్ కమల్ రాజు కి పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలిపారు.


సభను విజయవంతం చేసేందుకు దోహదపడ్డ రాష్ట్రస్థాయి చైర్మన్ లకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు కార్పొరేషన్ చైర్మన్ లకు, సర్పంచులకు, కార్పొరేటర్లకు, వార్డు మెంబర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 


సభా ప్రాంగణంలో వాలంటరీగా సేవలందించిన యువజన విభాగం నాయకులకు, ముస్లిం మైనార్టీ నాయకులకు, వివిధ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


మీడియా సమావేశం అనంతరం గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లా అగ్ర నాయకులను సమన్వయం చేస్తూ ఎనలేని కృషిచేసిన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్  టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు  ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య ను యువజన విభాగం ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


మీడియా సమావేశంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం నగర మేయర్ నీరజ  సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్  మార్కెట్ చైర్మన్ ప్రసన్న లక్ష్మీ  జిల్లా యువజన అధ్యక్షులు కృష్ణ చైతన్య, నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు  రూరల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు , పార్టీ సీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ కార్పొరేటర్ కమర్తపు మురళి  తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ శేషు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకులు రవి కిరణ్  మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments