దళిత,గిరిజన, బహుజనులపై జరుగుతున్న దాడులకు నిరసనగా......చలో నాగర్ కర్నూల్...

 దళిత,గిరిజన, బహుజనులపై జరుగుతున్న దాడులకు నిరసనగా......చలో నాగర్ కర్నూల్...

.కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన......జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భద్రాచల శాసనసభ్యులకు పొదెం వీరయ్య.....

Ck న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి 

జనవరి 20



  శుక్రవారం ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజనలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జనవరి 22వ తారీఖున జరగబోవు చలో నాగర్ కర్నూల్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయటం కొరకు జిల్లా ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.


ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,భద్రాచల శాసనసభ్యులకు పొదెం వీరయ్య  హాజరై.....తెలంగాణ ఏర్పడిన నాటి నుండి అనేక రకాల దాడులు దళిత, గిరిజన,బహుజనులపై జరుగుతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తుందని,ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు జిల్లాల నుండి ప్రజలు వేలాది సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


 జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చింతరేల రవికుమార్  మాట్లాడుతూ.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి దళిత, గిరిజన,బహుజనులు అందరూ హాజరై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్ష పాలనకు చరమగీతం పాడటానికి.ఒక వేదికైన చలో నగర్ కర్నూల్ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి రంగారావు, గండేపల్లి, బంధం శ్రీనివాస్ గౌడ్, హనుమంతరావు,సరేళ్ళ వెంకటేష్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము, లంజపల్లి వెంకట నరసయ్య, కారుమంచి సతీష్,కొప్పుల సాయి, మహిళా మైనార్టీ సెల్ నాయకులు హసీనా,వసీమ మహిళా కాంగ్రెస్ నాయకులు పందాల సరిత,కుమారి, పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు,ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అలవాల రాజా తదితరులు పాల్గొన్నారు.

Comments